వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

సోషల్ మీడియా యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఇన్‌బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి  తెచ్చింది. ఇంతకుముందే ఈ ఫీచర్ ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మీ స్మార్ట్ ఫోన్ మరొకరి చేతిలో ఉన్నా.. వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసి చూసే అవకాశం ఉండదు. అది కేవలం మీ ఫింగర్ ప్రింట్‌తోనే ఓపెన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ […]

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!
Follow us

|

Updated on: Nov 03, 2019 | 12:45 AM

సోషల్ మీడియా యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఇన్‌బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి  తెచ్చింది. ఇంతకుముందే ఈ ఫీచర్ ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మీ స్మార్ట్ ఫోన్ మరొకరి చేతిలో ఉన్నా.. వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసి చూసే అవకాశం ఉండదు. అది కేవలం మీ ఫింగర్ ప్రింట్‌తోనే ఓపెన్ అవుతుంది.

ఫింగర్ ప్రింట్ ఫీచర్ పొందండి ఇలా..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అందులో అకౌంట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అప్పుడు ప్రైవసీలోకి వెళ్తే.. అక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ కనిపిస్తుంది. ఇక దాన్ని ట్యాప్ చేసి ఎనేబుల్ చేస్తే.. మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు. అప్పుడు ‘మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నే వాట్సాప్ అన్ లాక్ చేయడానికి కూడా ఉపయోగించమంటారా.? అనే ఆప్షన్ అడుగుతుంది. దాన్ని మీరు కన్ఫర్మ్ చేయండి. ఇక అప్పుడు ఆప్షన్ కింద ఒక టైమర్ కూడా కనిపిస్తుంది. ఆ టైమర్‌లో సమయాన్ని కూడా సెట్ చేసుకుని ఈ ఫీచర్‌ను వాడుకోండి.

కాగా, వాట్సాప్‌లో మున్ముందు మరిన్ని సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. డార్క్ మోడ్, మల్టీ ప్లాట్‌ఫాం, పేమెంట్ వంటివి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.