ఆడిదాస్ ఫ్రీ షూస్.. ఆఫర్ నమ్మితే అంతా ఫట్టే..!

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి ముసలివారి దాకా అందరూ వాట్సాప్ యూజర్లే.. పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఆఫర్ల పేరుతో పలు రకాల ఫేక్ మెసెజ్‌లు వస్తుండటం సహజం. వాటిని నమ్మి మోసపోతున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఆఫర్లు అనగానే చాలామంది ఇట్టే నమ్మేస్తారు. అక్కడే బోల్తా పడతారు. ప్రముఖ షూస్ కంపెనీ ఆడిదాస్.. తన 93వ వార్షికోత్సవం సందర్భంగా.. రూ.5వేల విలువ చేసే షూస్‌ని ఆఫర్ చేస్తోందన్న మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ […]

ఆడిదాస్ ఫ్రీ షూస్.. ఆఫర్ నమ్మితే అంతా ఫట్టే..!
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 6:12 PM

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి ముసలివారి దాకా అందరూ వాట్సాప్ యూజర్లే.. పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఆఫర్ల పేరుతో పలు రకాల ఫేక్ మెసెజ్‌లు వస్తుండటం సహజం. వాటిని నమ్మి మోసపోతున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఆఫర్లు అనగానే చాలామంది ఇట్టే నమ్మేస్తారు. అక్కడే బోల్తా పడతారు. ప్రముఖ షూస్ కంపెనీ ఆడిదాస్.. తన 93వ వార్షికోత్సవం సందర్భంగా.. రూ.5వేల విలువ చేసే షూస్‌ని ఆఫర్ చేస్తోందన్న మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫ్రీ షూస్ కావాలంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి అంటూ.. ఓ లింక్ మెసేజ్‌లో కనిపిస్తుంది. అంతే కాదు ఈ మెసేజ్‌ని మరో 15 మందికి పంపితే మరో గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్ అని ఉంటుంది. ఇది నిజమే అని నమ్మి చాలామంది లింక్‌ను ఓపెన్ చేసి మోసపోతున్నారు. అయితే ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని డిలీట్ చేయడం మంచిది. ఆడిదాస్ కంపెనీ అసలు ఇలాంటి ఆఫర్లే ఇవ్వలేదు.

గతేడాది కూడా ఇలాంటి మెసేజ్ వైరల్ అయింది. రూ.3వేల విలువ చేసే షూస్‌ని ఆఫర్ చేస్తోందన్న మెసేజ్ వైరల్ అయింది. అయితే, ఓ ప్రముఖ వెబ్ సైట్ ఇలాంటి డూప్లికేట్ మెసేజ్‌లను తయారు చేస్తోంది. ఈ లింక్‌ను క్లిక్ చేసి.. వ్యక్తిగత వివరాలు ఫిల్ చేస్తే సరి ఇక మోసపోయినట్లే. వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటూ.. ఆ వెబ్ సైట్ సొమ్ము చేసుకుంటోంది. ఇక దసరా పండుగ సందర్భంగా ఇలాంటి ఆఫర్ మెసేజ్‌లు ఎక్కువైపోయాయి. అమెజాన్ సేల్, ఫ్లిప్ కార్ట్ పేర్లతో కూడా మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సార్లు 99శాతం డిస్కౌంట్ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వాట్సాప్‌లో ఇలాంటి ఆఫర్ మెసేజ్‌లను చూసి మోసపోకండి. నేరుగా వెళ్లి షాపింక్ చేసుకోవడమే మేలు.