Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

వాట్సాప్‌లో వదంతులు ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలిసిపోతుందట..

WhatsApp can trace message origin.. IIT Madras professor suggests two methods, వాట్సాప్‌లో వదంతులు ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలిసిపోతుందట..

వాట్సాప్.. ప్రస్తుతం సులభంగా సమాచారం ఇతరులకు అందివ్వడంలో.. అన్నింటికన్నా ముందున్న సామాజిక మాధ్యమం. అయితే దీని ద్వారా విలువైన సమాచారమే కాకుండా.. వదంతులు కూడా వ్యాప్తిచెందుతున్నాయి. అయితే ఈ వదంతులను ఎవరు పంపిస్తున్నారో గుర్తించడం కష్టంగా ఉండేది. దీంతో ఆకతాయిలు అదే పనిగా దీని ద్వారా వదంతులను షేర్ చేస్తూ.. అలజడి సృష్టించేవారు. అయితే ఈ వదంతులు ఎవరు ప్రారంభిస్తున్నారు.. ఎవరు తొలుత ఈ సందేశాన్ని పోస్ట్ చేస్తున్నారన్నమూలాలను కనుగొనేందుకు ఐఐటీ-మద్రా స్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ రెండు పరిష్కారాలు సూచించారు.

సామాజిక మాధ్యమాలపై దాఖలైన రెండు వ్యాజ్యాలను విచారిస్తున్న మద్రాసు హైకోర్టు.. వాట్సాప్‌లో వదంతుల సమస్యకు పరిష్కారాలు సూచించాలని జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు, ఐఐటీ-ఎం ప్రొఫెసర్‌ కామకోటికి సూచించింది. అయితే గత నెల 31న ఆయన రెండు పరిష్కారాలను కోర్టుకు నివేదించారు.
అందులో మొదటిది.. వాట్సాప్‌ సందేశాలతోపాటు మొదట పంపిన వ్యక్తి సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ అయ్యేలా చేయడం. సందేశంలో ఎన్‌క్రిప్ట్‌ అయిన మూలాలను డీక్రిప్ట్‌ చేసి విశ్లేషిస్తే వదంతిని తొలుత వ్యాప్తి చేసిందెవరో తెలిసిపోతుంది.

ఇక రెండో సూచనలో.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని గుర్తించగానే దాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి, ఆ సందేశం కనిపించకుండా చేయడం.. అంటే.. ఆ సమాచారం అంతకు ముందు ఇన్‌బాక్సులో ఉన్నవారికి కూడా కనిపించదు. అయితే.. వదంతులను కాపీ, పేస్ట్‌ చేసి ఫార్వర్డ్‌ చేసినా.. ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైళ్లు జోడించి ఇతరులకు పంపినా.. దాన్ని మొదటి సందేశంగా అంటే పరిగణిస్తారు. ఈ విధంగా చేస్తే.. వదంతుల వ్యాప్తికి చెక్ పెట్టొచ్చంటూ ఫ్రోఫెసర్ వెల్లడించారు. సో.. ఇక నుండి ఏదైనా పోస్ట్ చేసే ముందు అది సరైనదో కాదో.. చూసి ఫార్వర్డ్ చేయండి. లేదంటే.. సైబర్ నేరాల కింద బుక్కవ్వడం ఖాయం.