Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

మీ వాట్సాప్ ఎప్పుడైనా డిలీట్ అవ్వొచ్చు.. కాపాడుకోండిలా..!

WhatsApp Banning Users in Groups with Suspicious Names, మీ వాట్సాప్ ఎప్పుడైనా డిలీట్ అవ్వొచ్చు.. కాపాడుకోండిలా..!

ఫేక్‌ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వాట్సాప్ ఫ్వార్వర్డ్ లిమిట్‌ను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే త్వరలో వాట్సాప్ కొందరి అకౌంట్లను బ్యాన్ చేస్తుందన్న పుకార్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కొందరు, తమ అకౌంట్లు బ్యాన్ అయ్యాయని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. గ్రూప్‌లలో సభ్యుల వివరాలు సరిగ్గా లేవన్న కారణంగా వాట్సాప్ తమ అకౌంట్లను బ్యాన్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. కానీ పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన గ్రూపులు, అలాంటి పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్న సభ్యుల్ని మాత్రమే వాట్సాప్ బ్యాన్ చేస్తోంది. గ్రూప్‌ల పేర్లు, సభ్యుల పేర్ల విషయంలో వాట్సాప్‌కు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాట్సాప్ యూసేజ్ పాలసీలో వీటన్నింటిని మనం స్పష్టంగా చూడొచ్చు. ఏది ఏమైనా వాట్సాప్‌లో అకౌంట్ గానీ, గ్రూప్ గానీ ఒక్కసారి బ్యాన్ అయితే.. మళ్లీ తిరిగి పొందడం అసాధ్యం. ఇలాంటి సమయంలో వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేముందు ఒకసారి వాట్సాప్ సెక్యురిటీ బ్లాగ్, యూసేజ్ రూల్స్ తెలుసుకుంటే మంచిది. ఇక మీ గ్రూప్ పేరు కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇక మీరు గ్రూప్ అడ్మిన్ అయితే.. మీ గ్రూప్‌లోని సభ్యులు అభ్యంతరకర పోస్టులు ఫార్వర్డ్ చేస్తే హెచ్చరించొచ్చు. నచ్చకపోతే ఆ సభ్యులను గ్రూప్ నుంచి తొలగించవచ్చు. ఇది కాకుండా మీరు యూజర్ అయితే.. ఏ గ్రూప్‌లో చేరాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్‌లో మీరు మార్పులు చేసుకోవచ్చు. ఇక మీ వాట్సాప్ బ్యాన్ అయినట్లైతే.. పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన మెసేజ్‌లేవీ మా గ్రూప్‌లో లేవని వాట్సాప్‌కు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్ ఛానెల్స్ వాడుకోవచ్చు. సో ఈ రోజే మీ వాట్సాప్‌ను చెక్‌ చేసుకోండి మరి.