Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ధోని ఈ మౌనం ఎందులకు?

Dhoni Retirement, ధోని ఈ మౌనం ఎందులకు?

2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని విశ్వసనీయవర్గాల సమాచారం.

కోహ్లీ ట్వీట్‌తో ధోని రిటైర్మైంట్‌పై ప్రకంపనలు:

ఇటీవల ధోనీ గురించి భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2016లో టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లో ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ‘నేను ఎన్నటికీ మరిచిపోలేని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిటెనెస్‌ పరీక్షలో పరుగెత్తించినట్టు ధోనీ నన్ను పరుగులు పెట్టించాడు.’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో ధోనీ వీడ్కోలు గురించి పరోక్షంగా కోహ్లీ పోస్ట్ చేశాడని ఊహాగానాలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను ధోనీ సతీమణి సాక్షి కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది.

ధోని రిటైర్మెంట్‌పై కోహ్లి రియాక్షన్:

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ప్రారంభమయ్యే ముందు ధోనీ గురించి కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ‘ధోనీ ఇంకా జట్టుకోసం ఆలోచిస్తున్నాడు. అతడు టీమ్‌ఇండియాకు ఎంతో విలువైన ఆటగాడు, రిటైర్మెంట్‌ అనేది వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయంపై ఇతరులెవరూ మాట్లాడిల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నాడు. ధోనీ భవితవ్యంపై మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. ధోనీ తన నిర్ణయాన్ని సెలక్షన్‌ కమిటీకి తెలియజేయాలని సూచిస్తున్నారు. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

15 రోజులు కాశ్మీర్‌లో:

ప్రపంచకప్ 2019 ధోనీ చివరిది అని అనుకున్నారు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్‌లో గడిపాడు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు.

ఈ పుకార్లపై క్లారిటీ ఎప్పుడు?

కాగా ధోని రిటైర్మెంట్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. ఒకవైపు క్రికెట్ ఆడకుండా..మరోవైపు వీడ్కోలు పలకకుండా అతడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. బీసీపీఐ కానీ, భారత కెప్టెన్ కోహ్లీ కానీ ధోని రిటైర్మెంట్‌ నిర్ణయం అతడి వ్యక్తిగతమంటున్నారు. మరి ధోని మనసులో ఏముందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.

Related Tags