నిజంగా.. మీరు ఆహారమే తింటున్నారా..?

నిజంగా మీరు ఆహారాన్నే తింటున్నామని అనుకుంటున్నారా..? నో ఆహారంతో పాటు కొన్ని పురుగులు, మాట్స్‌లను కూడా తింటున్నారు. ఏంటి ఆశ్యర్యంగా ఉంది కదూ.. నిజంగా.. మీ ఆహారం మీద ఉండే పురుగులు, మాట్స్, ఇతర గగుర్పాటు క్రాల్లు ఉన్నట్లు వెల్లడించారు ఒక వైద్య విద్యార్థి. మార్టిన్ కామే క్రిస్టియన్సెన్ (28) అనే విద్యార్థి తాజాగా.. మనం తినే ఆహారంపై కొన్ని పరిశోధనలు నిర్వహించడానికి ఒక శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనిపెట్టారు. అందులో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. […]

నిజంగా.. మీరు ఆహారమే తింటున్నారా..?
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 2:20 PM

నిజంగా మీరు ఆహారాన్నే తింటున్నామని అనుకుంటున్నారా..? నో ఆహారంతో పాటు కొన్ని పురుగులు, మాట్స్‌లను కూడా తింటున్నారు. ఏంటి ఆశ్యర్యంగా ఉంది కదూ.. నిజంగా.. మీ ఆహారం మీద ఉండే పురుగులు, మాట్స్, ఇతర గగుర్పాటు క్రాల్లు ఉన్నట్లు వెల్లడించారు ఒక వైద్య విద్యార్థి.

మార్టిన్ కామే క్రిస్టియన్సెన్ (28) అనే విద్యార్థి తాజాగా.. మనం తినే ఆహారంపై కొన్ని పరిశోధనలు నిర్వహించడానికి ఒక శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనిపెట్టారు. అందులో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం నాలుగు నిమిషాల పాటు మార్టిన్ కామే క్యారెట్లు, బంగాళాదుంపలు,సెలరీలపై పరిశోధన చేశారు. వాటిపై చనిపోయిన, అలాగే బతికున్న పురుగులు ఉన్నట్లు కనుగొన్నారు.

కానీ.. ఆహారంలో కనిపించేవి హానికరం కాదని.. చనిపోయినవి ఉంటే హానికరమని చెప్పారు మార్టిన్ కామే క్రిస్టియన్. పురుగులు, శిలీంధ్రాలు, వీటిని హుక్వార్మ్స్, పిన్వామ్స్ అని పిలుస్తారు. కానీ.. శాస్త్రీయంగా వీటిని నెమటోడ్స్ అని అంటారు. కాగా.. ఆహారంపై ఉండే పురుగులు, వాటి గుడ్లను తిన్నట్లయితే.. వివిధ రకాల అనారోగ్య సమస్యలు కలిగిస్తాయని మార్టిన్ కామే పేర్కొన్నారు. కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని తెలిపారు. అలాగే.. చర్మవ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని స్పష్టం చేశారు.

ఏదేమైనప్పటికీ.. శుభ్రంగా కడిగిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌ను తినడం మంచిదని నిపుణుల సలహా.