టెక్సాస్ ఈవెంట్..మోదీ , ట్రంప్ ఇద్దరికీ ప్రయోజనమే !

టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీ మోదీ ‘ పేరిట జరగనున్న మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీతో బాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని వైట్ హౌస్ మళ్ళీ సోమవారం ధృవీకరించింది. సుమారు 50 వేల మంది ఇండియన్ అమెరికన్స్ ఈ ఈవెంట్ కు హాజరు కానున్న సంగతి తెలిసిందే. వచ్ఛే ఏడాది యుఎస్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ […]

టెక్సాస్ ఈవెంట్..మోదీ , ట్రంప్ ఇద్దరికీ ప్రయోజనమే !
Follow us

|

Updated on: Sep 17, 2019 | 1:42 PM

టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీ మోదీ ‘ పేరిట జరగనున్న మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీతో బాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని వైట్ హౌస్ మళ్ళీ సోమవారం ధృవీకరించింది. సుమారు 50 వేల మంది ఇండియన్ అమెరికన్స్ ఈ ఈవెంట్ కు హాజరు కానున్న సంగతి తెలిసిందే. వచ్ఛే ఏడాది యుఎస్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే ‘ ఓటు బ్యాంకులే ‘ వీరు ! తాను, ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోవడాన్ని ‘ స్పెషల్ గెస్చర్ ‘ గా మోదీ ట్వీట్ చేశారు. ఇది భారత-అమెరికా దేశాల మధ్య ప్రత్యేక స్నేహానికి దారి తీస్తుందని అన్నారు. ఇటీవలి నెలల్లో ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త దెబ్బ తిన్నాయి. భారత దేశానికి సంబంధించి సుంకాలు లేని విధానానికి (జనరలైజ్డ్ సిస్టం) యుఎస్ వాణిజ్య అధికారి రాబర్ట్ లిథిజర్ రద్దు చేయడం, మరోవైపు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై భారత ప్రభుత్వం సుంకాలు పెంచడంవంటి వాటి కారణంగా ఈ దేశాల మధ్య పరోక్ష ‘ టారిఫ్ వార్ ‘ మొదలైంది. అయితే యుఎస్ నుంచి ఇంధన సంబంధ దిగుమతుల ఆర్దర్లను ప్రస్తుతమున్న 4 బిలియన్ డాలర్ల నుంచి మరింత పెంచడానికి ఇండియా అంగీకరించడంతో పరిస్థితి కొంత ‘ చల్లబడింది ‘. అటు-హౌదీ మోదీ ఈవెంట్ సందర్భంగా మోదీ.. అమెరికాలో వారం రోజులపాటు ఉంటారు. ఈ నెల 23 న యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే 27 న ఐరాస సర్వ ప్రతినిధి సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు.

మెగా ఈవెంట్ సందర్భంగా ఇరు దేశాధినేతలూ భేటీ కావడం వీరి ‘ రాజకీయ బలోపేతానికి ‘ తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ప్రెజన్స్ వల్ల తన ప్రభుత్వ ఆర్ధిక విధానాలకు అనేకమంది నుంచి మద్దతు లభిస్తుందని మోదీ భావిస్తుండగా.. యుఎస్ లో ఇండియన్ అమెరికన్ ఓటర్ల సపోర్ట్ ను తాను కూడగట్టగలుగుతానని ట్రంప్ ఆశిస్తున్నారు. వచ్ఛే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు డెమొక్రాట్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి పట్ల ఇండియన్ అమెరికన్లు కూడా మొగ్గు చూపుతున్నారని రీసర్చ్ ఫౌండేషన్ అబ్జర్వర్ కషిష్ పర్వియానీ అంటున్నారు. అయితే మోదీ-ట్రంప్ తాజా భేటీ కారణంగా వీరి వైఖరి రిపబ్లికన్లకు అనుకూలంగా మారే సూచనలున్నాయని కషిష్ అభిప్రాయపడ్డారు. టెక్సాస్ లో సుమారు రెండు లక్షల 70 వేల మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. వీరిలో అనేకమంది ట్రంప్ కు ఓటు వేస్తే ఆయన తిరిగి అధ్యక్షపీఠమెక్కడానికి అది దోహదపడుతుందని భావిస్తున్నారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..