‘ నిర్మల ‘ బడ్జెట్ లో ‘ తాయిలాలు ‘ ? సామాన్యుడి ఎదురుచూపులు !

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్ఛే జులై నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ మాదిరే ఈ బడ్జెట్ కూడా ఉండవచ్చునని భావిస్తున్నా.. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు నిర్మలా సీతారామన్ మరిన్ని రాయితీలు ప్రకటించవచ్చుననే ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ రెండో హయాంలో కొత్త విత్త మంత్రి ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఫిబ్రవరి నాటి […]

' నిర్మల ' బడ్జెట్ లో ' తాయిలాలు ' ? సామాన్యుడి ఎదురుచూపులు !
Follow us

|

Updated on: Jun 13, 2019 | 4:35 PM

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్ఛే జులై నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ మాదిరే ఈ బడ్జెట్ కూడా ఉండవచ్చునని భావిస్తున్నా.. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు నిర్మలా సీతారామన్ మరిన్ని రాయితీలు ప్రకటించవచ్చుననే ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ రెండో హయాంలో కొత్త విత్త మంత్రి ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఫిబ్రవరి నాటి ఇంటెరిమ్ బడ్జెట్లో ప్రభుత్వం ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి పన్నులను తగ్గించింది. చిన్న, సన్నకారు రైతులకు ‘ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ‘ పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయల సాయాన్ని మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రభుత్వ ఖజానాపై రూ. 75 వేల కోట్ల భారం పడుతుంది. అలాగే సాలుకు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు పూర్తి టాక్స్ రిబేట్ ను అప్పటి తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. అంటే ఆదాయం పన్ను నుంచి వారిని మినహాయించారు. ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్… తాను, తన టీమ్ ప్రజలనుంచి ఫీడ్ బ్యాక్ సేకరించామని, వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అటు-ఈ సాధారణ బడ్జెట్లో పన్నుల వ్యవస్థను సరళీకరించగలరన్న ఆశాభావాన్ని ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తం చేశాయి. కార్పొరేట్, ఇండివిజ్యుల్ పన్నులను కొత్త ప్రభుత్వం తగ్గించాలని, ఎగుమతిదారులకు అనువుగా పన్ను రాయితీలు ఇవ్వాలని ‘ ఫిక్కీ ‘ ప్రతినిధులు కోరుతున్నారు. అటు-దేశ ఆర్ధిక పరిస్థితిని పునరుజ్జీవింపజేయడానికి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆర్ధిక నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం ఎకానమీ భేషుగ్గా ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. నిరుద్యోగ సమస్య పెరిగిందని ఈ విషయాన్ని గుర్తించాలని వారు అంటున్నారు. ప్రధాని మోదీకి గత సంవత్సరం వరకు సీనియర్ అడ్వైజర్ గా ఉన్న అరవింద్ సుబ్రమణ్యన్.. ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాల లెక్కలను ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారని హార్వర్డ్ వర్కింగ్ పేపర్ లో రాసిన తన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఆర్ధిక వృద్ద్ధి రేటు 7 శాతం ఉందని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఇది 4.5 శాతం మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు బ్యాంకింగ్ సంస్కరణల మీదా ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారు. ప్రజలకు కేవలం తాయిలాలు ఇస్తే మాత్రమే సరిపోదు.. బడ్జెట్ రూపకల్పనలో నిపుణుల సలహాలను ప్రభుత్వం తీసుకోవాలి అని సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు.