2019 యాపిల్ ఈవెంట్… కొత్తగా ఏం రాబోతున్నాయ్?

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన నూతన ప్రొడక్ట్స్ లాంచింగ్ ఈవెంట్‌ నిర్వహించబోతోంది. కాలిఫోర్నియాలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ కంపెనీ తీసుకురాబోయే కొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. యాపిల్‌ తదుపరి ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లను తీసుకురానుంది. వీటితో పాటు తదుపరి వాచ్‌ సిరీస్‌, ఐవోఎస్‌ 13 ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ […]

2019 యాపిల్ ఈవెంట్... కొత్తగా ఏం రాబోతున్నాయ్?
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 5:08 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన నూతన ప్రొడక్ట్స్ లాంచింగ్ ఈవెంట్‌ నిర్వహించబోతోంది. కాలిఫోర్నియాలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ కంపెనీ తీసుకురాబోయే కొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. యాపిల్‌ తదుపరి ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లను తీసుకురానుంది. వీటితో పాటు తదుపరి వాచ్‌ సిరీస్‌, ఐవోఎస్‌ 13 ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఈవెంట్‌లో ఈసారి విడుదల చేస్తారని భావిస్తున్న పలు నూతన ప్రొడక్ట్స్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

ఐఫోన్‌ తదుపరి సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 11 పేరిట మూడు ఫోన్లను యాపిల్‌ తీసుకురాబోతోంది. వీటికి సంబంధించి పలు వార్తలు ఇప్పటికే బయటకొచ్చాయి. రూమర్స్‌ ప్రకారం ఐఫోన్‌11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 మ్యాక్స్‌ ప్రో పేరిట మూడు ఫోన్లు రానున్నాయి. ఈ మూడింటిలోనూ మూడేసి కెమెరాలు ఉండబోతున్నట్లు సమాచారం. ధర, ఇతర వివరాలు రేపటి ఈవెంట్‌లో తెలుస్తాయి.

ఈసారి యాపిల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాల్లో తమ అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తక్కువ ధరలో ఐఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 2016లో ఇలానే ఐఫోన్‌ ఎస్‌ఈ పేరిట తక్కువ ధరలో ఫోన్‌ను ఆవిష్కరించారు. అదే తరహాలో ఈ సారి సైతం తక్కువ ధరలో ఓ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది.

ఈ ఈవెంట్‌లో యాపిల్‌ తన లేటెస్ట్ ఐవోఎస్‌ వెర్షన్‌ 13ను విడుదల చేయబోతోంది. ఇందులో యాప్‌ సైజ్‌ 50 శాతం వరకు తగ్గించడంతో పాటు యాప్‌ అప్‌డేట్‌ సైజ్‌ను సైతం 60 శాతం మేర తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వెర్షన్‌లో ఫేస్‌ఐడీ 30 శాతం వేగంగా పనిచేయనుంది. దీంతో పాటు ఐవోఎస్‌ 13లో ఈసారి డార్క్‌మోడ్‌ ఫీచర్‌ను తీసురానుంది. ఇప్పటి వరకు ఇదే అతి వేగవంతమైన ఓఎస్‌గా యాపిల్‌ పేర్కొంటోంది.

వీటితో పాటు ఐఫోన్‌ తన వాచ్‌ సిరీస్‌ 5ను కూడా ఇదే ఈవెంట్‌లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అప్‌డేట్‌ చేసిన మ్యాక్‌ బుక్‌ను కూడా లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. యాపిల్‌ టీవీ ప్లస్‌ సిరీస్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయంతోపాటు, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ సిరీస్‌లో కనిపించే పెన్‌ తరహాలో యాపిల్‌ కూడా పెన్సిల్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ గురించి కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇంకా ఏమేం కొత్త సంగతులు తీసుకొస్తుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! ఈ సారి టిమ్‌కుక్‌ ఆవిష్కరించబోయే యాపిల్‌ కొత్త ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యక్షప్రసారాన్ని తొలిసారి యూట్యూబ్‌లో యాపిల్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. మంగళవారం ఉదయం భారత కాలమానం ప్రకారం.. 10.30గంటలకు జరిగే ఈ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో అందరూ వీక్షించే ఏర్పాటు చేస్తోంది.

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం