మత స్వేఛ్చపై మీరా మాకు చెప్పేది ? అమెరికాపై భారత్ నిప్పులు

ప్రపంచ దేశాల్లో మత స్వేఛ్చ, మైనారిటీలమీద హింసపై అమెరికా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికను తప్పులతడకగా అభివర్ణించింది. రాజ్యాంగ బధ్ద రక్షణ పొందుతున్న భారతీయులపై ఓ విదేశీ ప్రభుత్వం ఇలా వ్యాఖ్యానించడం సబబు కాదని పేర్కొంది. బీజేపీ లోని కొందరు సీనియర్ నేతలు మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయని ఆ నివేదిక ప్రస్తావించడం మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని ఇరకాటాన బెట్టడానికి, వీటి […]

మత స్వేఛ్చపై మీరా మాకు చెప్పేది ? అమెరికాపై భారత్ నిప్పులు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 24, 2019 | 12:17 PM

ప్రపంచ దేశాల్లో మత స్వేఛ్చ, మైనారిటీలమీద హింసపై అమెరికా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికను తప్పులతడకగా అభివర్ణించింది. రాజ్యాంగ బధ్ద రక్షణ పొందుతున్న భారతీయులపై ఓ విదేశీ ప్రభుత్వం ఇలా వ్యాఖ్యానించడం సబబు కాదని పేర్కొంది. బీజేపీ లోని కొందరు సీనియర్ నేతలు మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయని ఆ నివేదిక ప్రస్తావించడం మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని ఇరకాటాన బెట్టడానికి, వీటి ప్రతిష్టను దెబ్బ తీయడానికేనని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దుయ్యబట్టింది.

అమెరికా విదేశాంగ శాఖ తన వార్షిక ‘ 2018 ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ రిపోర్టు ‘ లో ప్రపంచ వ్యాప్తంగా మత విశ్వాసాల ఉల్లంఘన, వివిధ మత బృందాలు అనుసరిస్తున్న విధానాలు, మత స్వేఛ్చను ప్రమోట్ చేసేందుకు తాము పాటిస్తున్న పాలసీలను వివరించింది. ఆయా దేశాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనల గురించి పేర్కొంటూ ముఖ్యంగా ఇండియాలో రెలిజియస్ ఫ్రీడమ్ దుర్వినియోగమవుతోందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. భారత దేశంలో మైనారిటీ గ్రూపులమీద ప్రధానంగా ముస్లిం గ్రూపులపై 2018 లో హిందూ సంఘాలు హింసాత్మక దాడులకు తెగబడ్డాయని, బీఫ్ కోసం ఆవులను చంపుతున్నారన్న వదంతులతో ఈ హిందూ సంఘాలు మైనారిటీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ వచ్చాయని, దాడుల్లో పలువురు హతులయ్యారని..ఇలా దేశంలో జరుగుతున్న సంఘటనలను గుర్తు చేయడంతో విదేశాంగ శాఖ మండిపడింది. ముందు మీ దేశంలో జరుగుతున్న జాతి వివక్ష, జాతి విద్వేష ఘటనలపై దృష్టి పెట్టాలని, పొరుగు దేశాలతో దెబ్బ తింటున్న మీ ద్వైపాక్షిక సంబంధాలపై పునరాలోచించాలని బీజేపీ నేతలు నిప్పులు కక్కారు. భారత రాజ్యాంగం ఈ దేశంలోని మైనారిటీలతో సహా ప్రజలందరికీ రక్షణ కల్పిస్తోందని. కేవలం దేశంలో అక్కడక్కడా జరిగిన ఘటనలను భూతద్దంలో చూడడం సముచితం కాదని వారన్నారు. మీ దేశంలో నానాటికీ పెరిగిపోతున్న గన్ కల్చర్ గురించి తెలియనిదెవరికి అని ఎత్తిపొడిచారు.