ఇదేం విడ్డూరం.. డ్రైవింగ్ టెస్ట్‌కి, జీన్స్‌ ప్యాంట్‌కు లింకా..?

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం వెళ్లిన ఆ యువతికి ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా వెహికిల్‌ని తీసుకుని ఆర్టీఓ కార్యాలయం వెళితే.. సంబంధిత స్లాట్ బుకింగ్‌‌లో కేటాయించిన సమయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఆ సమయంలో అక్కడ ఉండే ఆర్టీఓ అధికారి.. మన డ్రైవింగ్ నైపుణ్యాన్ని చూసి.. లైసెన్స్ జారీ చేస్తారు. ఇది ప్రాసెస్. కానీ చెన్నైలో ఇలా వెళ్లిన ఓ మహిళకు అక్కడి ఆర్టీఓ అధికారులు ఝలక్ ఇచ్చారు. బహుశా దేశంలో ఎక్కడా కూడా […]

ఇదేం విడ్డూరం.. డ్రైవింగ్ టెస్ట్‌కి, జీన్స్‌ ప్యాంట్‌కు లింకా..?
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 1:34 PM

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం వెళ్లిన ఆ యువతికి ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా వెహికిల్‌ని తీసుకుని ఆర్టీఓ కార్యాలయం వెళితే.. సంబంధిత స్లాట్ బుకింగ్‌‌లో కేటాయించిన సమయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఆ సమయంలో అక్కడ ఉండే ఆర్టీఓ అధికారి.. మన డ్రైవింగ్ నైపుణ్యాన్ని చూసి.. లైసెన్స్ జారీ చేస్తారు. ఇది ప్రాసెస్. కానీ చెన్నైలో ఇలా వెళ్లిన ఓ మహిళకు అక్కడి ఆర్టీఓ అధికారులు ఝలక్ ఇచ్చారు. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఘటన జరిగి ఉండకపోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఓ యువతి డ్రైవింగ్ టెస్ట్ కోసం కేకే నగర్‌ ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్‌ కోసం కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది. అయితే టెస్ట్ డ్రైవ్ కోసం వారం రోజులుగా వెళ్లిన ఆమెకు.. సదరు అధికారి అనుమతించలేదు. దీంతో ఆర్టీఓ అధికారులు టెస్ట్ డ్రైవ్‌కు  అనుమతివ్వకపోవడానికి అసలు కారణంపై ఆరా తీసింది. దీంతో ఆర్టీఓ అధికారులు చెప్పిన మాట విని షాక్‌కు గురైంది. జీన్స్ ధరించినందుకే టెస్ట్ డ్రైవ్ అనుమతించలేదంటూ.. బాంబు పేల్చారు. టెస్ట్ డ్రైవ్‌లో సంప్రదాయ డ్రెస్సింగ్‌ ఉంటేనే అనుమతిస్తామని తెల్చేశారు అక్కడి అధికారులు. అయితే అధికారుల తీరుపై సదరు యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి రూల్ ఏంటని.. లేని నిబంధనలను పెట్టి ఇబ్బందులకు గురిచేయడమేంటంటూ ప్రశ్నించింది. అయితే అక్కడ ఈ యువతినే కాకుండా.. జీన్స్ ధరించి వచ్చే ప్రతి మహిళలకు అదే పరిస్థితి ఏర్పడింది.

కాగా, మగవారు లుంగీలు, షార్టులు అదే విధంగా యువతులు స్లీవ్‌లెస్ డ్రెస్, జీన్స్‌లు ధరించి డ్రైవింగ్ టెస్టు కోసం వస్తే వారిని అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు. డ్రైవింగ్ టెస్టు కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వారు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. అయితే లైసెన్స్‌ జారీ చేసే ఆర్టీఓ అధికారి మహిళల దుస్తులు సంప్రదాయబద్దంగా వుంటేనే లైసెన్స్‌ ఇవ్వాలని చేసిన ఆ అధికారుల ప్రయత్నాన్ని పలువురు అభినందించినప్పటికీ, దుస్తులు ధరించడం వ్యక్తిగత వ్యవహారమని పలువురు ఆరోపించడంతో ఈ విషయం పెనుదుమారం రేపింది. లైసెన్స్‌ పొందేందుకు 18 ఏళ్లు నిండితే చాలని, దుస్తుల నిబంధనలు లేవంటూ ఆ యువత ఆరోపిస్తోంది.

జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.