మీకు వైఫై కాల్స్ అంటే ఎంటో తెలుసా..? దానివల్ల ఎన్ని ఉపయోగాలో చూడండి..

ఫ్రీకాల్స్.. మొన్నటి వరకు దాదాపు అన్ని టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు తక్కవ ధరలకే అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫ్రీకాల్స్ ఇచ్చారు. అయితే ఉన్న ఫలంగా దాదాపు అన్ని నెట్‌వర్క్స్ కస్టమర్లపై మూకదాడి చేశాయి. ఒకేసారి అన్ని టారీఫ్ రేట్లను పెంచేశాయి. దీంతో సాధారణ కస్టమర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఆపరేటర్లంతా వారివారి కస్టమర్లను మచ్చిక చేసుకునేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. అందులో ఇప్పుడు రిలియన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు వైఫై కాలింగ్‌ సేవలను.. కస్టమర్లకు అందుబాటులోకి […]

మీకు వైఫై కాల్స్ అంటే ఎంటో తెలుసా..? దానివల్ల ఎన్ని ఉపయోగాలో చూడండి..
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2020 | 5:29 AM

ఫ్రీకాల్స్.. మొన్నటి వరకు దాదాపు అన్ని టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు తక్కవ ధరలకే అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫ్రీకాల్స్ ఇచ్చారు. అయితే ఉన్న ఫలంగా దాదాపు అన్ని నెట్‌వర్క్స్ కస్టమర్లపై మూకదాడి చేశాయి. ఒకేసారి అన్ని టారీఫ్ రేట్లను పెంచేశాయి. దీంతో సాధారణ కస్టమర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఆపరేటర్లంతా వారివారి కస్టమర్లను మచ్చిక చేసుకునేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. అందులో ఇప్పుడు రిలియన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు వైఫై కాలింగ్‌ సేవలను.. కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే.

జియో వైఫై కాలింగ్‌ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుండగా.. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ మాత్రం.. కేవలం కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే అసలు ఈ వైఫై కాలింగ్‌ అంటే ఏమిటన్నది చాలా మందికి తెలియదు. దీంతో ఎలాంటి లాభాలు ఉన్నాయి.. అన్న వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

వైఫ్ కాల్స్ అంటే..

“వీవోవైఫై” లేదా “వాయిస్‌ ఓవర్‌ వైఫై”నే వైఫై కాలింగ్‌ అంటారు. అంటే.. మనం సాధారణంగా మొబైల్‌ నుంచి చేసే కాల్స్ అన్నీ.. సంబంధిత మొబైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వెళ్తాయి. అయితే వీవోవైఫైలో మనం చేసే కాల్స్‌ అన్నీ.. వైఫై ద్వారా వెళ్తాయి. అందుకే దీనిని వైఫై కాలింగ్‌ అని పిలుస్తారు. దీని ద్వారా కస్టమర్లు స్పష్టమైన వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్.. కొన్ని చోట్ల చాలా వీక్‌గా ఉంటాయి. ఆ సమయంలో కాల్స్ చేస్తే డ్రాప్ అవుతుంటాయి. వాయిస్‌లో క్లారిటీ కూడా ఉండదు.

కానీ వైఫై కాలింగ్‌లో అలా డ్రాపింగ్ సమస్య తలెత్తే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంతేకాదు.. కాల్స్ మధ్యలో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు. అందుకే ఇప్పుడు మొబైల్ ఆపరేటర్లు వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అంతేకాదు.. ఈ వైఫై కాలింగ్ సర్వీసుకు ఎలాంటి రుసుమును కూడా వసూలు చేయడం లేదని జియో వంటి సంస్థలు పేర్కొన్నాయి.