కవిత సైలెన్స్ వెనుక రహస్యం ఏంటి.?

పార్టీ పవర్‌లో ఉంది. ప్రతిపక్షాలు అంత బలంగా లేవు. ఇది రాజకీయంగా అత్యంత అనువైన కాలం. సార్వత్రిక ఎన్నికల్లో చేసిన చిన్న షాక్ తప్ప… టీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ పొలిటికల్ వెదర్ ఫుల్ జోష్ నింపుతోందని సమాచారం. కానీ.. ఒక్క విషయంలోనే మాత్రం పార్టీ ఇంకా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం కూడా మాజీ ఎంపీ కవిత రాజకీయ భవిష్యత్తు గురించి అని సమాచారం.? ఇంతకీ కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కల్వ కుంట్ల కవిత […]

కవిత సైలెన్స్ వెనుక రహస్యం ఏంటి.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2019 | 8:52 PM

పార్టీ పవర్‌లో ఉంది. ప్రతిపక్షాలు అంత బలంగా లేవు. ఇది రాజకీయంగా అత్యంత అనువైన కాలం. సార్వత్రిక ఎన్నికల్లో చేసిన చిన్న షాక్ తప్ప… టీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ పొలిటికల్ వెదర్ ఫుల్ జోష్ నింపుతోందని సమాచారం. కానీ.. ఒక్క విషయంలోనే మాత్రం పార్టీ ఇంకా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం కూడా మాజీ ఎంపీ కవిత రాజకీయ భవిష్యత్తు గురించి అని సమాచారం.? ఇంతకీ కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కల్వ కుంట్ల కవిత మౌనం వీడేది ఎప్పుడు ? మళ్లీ యాక్టివ్ అవుతుందా.. లేదా..?

కల్వకుంట్ల కవిత. పరిచయం అక్కర్లేని నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాదు. సాంస్కృతిక ఉద్యమం కూడా నడిపించిన నేత. అలాంటి కవిత ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కేవలం ఒకే ఒక్క ఓటమితో కవిత సైలెంట్ అయ్యారు.

నిజామాబాద్ ఎంపీగా ఘోర ఓటమిపాలైన కవిత.. ఆ తర్వాత రాజకీయంగా చురుగ్గా లేరు. పార్టీ నేతలకు అందుబాటులోనే ఉన్నా.. దూకుడును ప్రదర్శించడం లేదు. ఓటమి నాటి నుంచి సైలెంట్‌గా ఉన్న కవిత.. రాజకీయాలకు దూరం కానున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ వర్గాల్లో మాత్రం ఆమె ఫ్యామిలీతో కలిసి చైనా వెళ్లి వచ్చారని.. అతి త్వరలోనే మళ్లీ యాక్టివ్ అవుతారని అంటున్నారు. అయితే మళ్లీ కవిత పొలిటికల్ స్క్రీన్ మీదకి వస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే.