Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

హుజుర్ నగర్ ఫలితంతో.. బీజేపీ అధ్యక్షుడి దారెటు?

What Is The Future Of BJP President K Laxman, హుజుర్ నగర్ ఫలితంతో.. బీజేపీ అధ్యక్షుడి దారెటు?

హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తాయి. కాలర్‌ ఎగిరేసి కమలం దూకుడు చూపాలని అనుకున్నారు. తీరా చూస్తే 2600 ఓట్లతో డిపాజిట్‌ గల్లంతు అయింది. ముందు నుంచి హుజుర్ నగర్‌లో గెలుస్తామనే ధీమా బీజేపిలో ఎక్కడా కనిపించలేదు. కానీ ఓ పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తే కాలర్‌ ఎగిరేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది కాస్తా సీన్‌ రివర్స్‌ అయింది. ఇక ఈ ఉపఎన్నిక ఫలితంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తల పట్టుకున్నారు. జాతీయ నాయకత్వానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆయన తికమకపడుతున్నారట.

అసలే డిసెంబర్‌లో కొత్త రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంది. దీంతో ఇప్పటికే జోరుగా పైరవీలు నడుస్తున్నాయి. గ్రూపుల వారీగా లిస్టులు అధిష్టానానికి చేరాయి. డిసెంబర్‌లో లక్ష్మణ్‌ పదవీ కాలం ముగుస్తోంది. సెకండ్‌ టర్మ్‌ తనకు రెన్యువల్‌ ఉంటుందని లక్ష్మణ్‌ ఆశపడ్డారట. నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపు లక్ష్మణ్‌కు కొంత బలం ఇస్తే….హుజూర్‌నగర్‌లో ఓటమి ఇప్పుడు మైనస్‌గా మారింది.

రెండో టర్మ్ ప్రెసిడెంట్ కాకపోతే.. కనీసం రాజ్యసభ సీటు వస్తుందనే ఆశలో లక్ష్మణ్ ఉండగా.. హుజుర్ నగర్ ఫలితం తర్వాత ఆయన్ని కొనసాగించాలా? లేదా? అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక లక్ష్మణ్ భవిష్యత్తు ఏంటనేది మరో నెల రోజుల్లో తెలియనుంది.