‘ నేనెందుకు రాజీనామా చేయాలి ‘ ?

Kumarswamy, ‘ నేనెందుకు రాజీనామా చేయాలి ‘ ?

కర్ణాటకలో 18 మంది సభ్యుల రాజీనామాలతో తన ప్రభుత్వం చిక్కుల్లో పడినప్పటికీ..సీఎం కుమారస్వామి నిబ్బరంగా ఉన్నారు. తన రాజీనామా అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు. మా ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. . మాకు తగినంతమంది ఎమ్మెల్యేలున్నారు.. అని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం గండంలో పడింది గనుక మీరు రాజీనామా చేయవచ్చునని గత రాత్రి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయని మీడియా గురువారం ప్రస్తావించగా.. ఆయన ఇదే మాట అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప ను ఆయన గుర్తు చేశారు. 2009-10 లో ఇదే ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా
ఉండగా.. ఎనిమిది మంది మంత్రులతో బాటు 18 మంది ఎమ్మెల్యేలు ఆయనను వ్యతిరేకించారని, అయితే అప్పుడాయన రాజీనామా చేశారా అని కుమారస్వామి అన్నారు. చివరకు ఏం జరిగిందో చూశారుగా అని వ్యాఖ్యానించారు. కాగా-ముంబైలోని హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి బెంగుళూరుకు బయల్దేరారు. ఇలా ఉండగా.. కర్ణాటక సంక్షోభాన్ని మరిపిస్తూ.. గోవాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 15 మంది కాంగ్రెస్ సభ్యుల్లో.. 10 మంది పాలక బీజేపీలో చేరిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్ లేకర్ నేతృత్వంలో ఈ పది మందీ కాంగ్రెస్ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. దీంతో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 27 కు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *