అసలు ‘హాల్‌మార్క్‌’ అంటే ఏంటి? ‘బంగారం’పై ఎందుకు ఉండాలి?

ఇంతకీ ఈ హాల్‌మార్క్‌ గుర్తు అంటే ఏంటో తెలుసా? ఇది చాలా మందికి తెలియని విషయం. హాల్‌మార్క్‌లో క్యారెట్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) స్టాంప్, హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్ ఆ సంవత్సరపు గుర్తు, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్..

అసలు 'హాల్‌మార్క్‌' అంటే ఏంటి? 'బంగారం'పై ఎందుకు ఉండాలి?
Follow us

| Edited By:

Updated on: Feb 22, 2020 | 5:52 PM

బంగారంపై హాల్ మార్క్‌ ఉంటే మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. ఇప్పుడు కొన్న ప్రతీ బంగారు ఆభరణం, వస్తువులపై హాల్‌మార్క్‌ని తప్పనిసరి చేసింది. అయితే.. ఇంతకీ ఈ హాల్‌మార్క్‌ గుర్తు అంటే ఏంటో తెలుసా? ఇది చాలా మందికి తెలియని విషయం. హాల్‌మార్క్‌లో క్యారెట్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) స్టాంప్, హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్ ఆ సంవత్సరపు గుర్తు, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్ ఉంటాయి. ఇది ముఖ్యంగా బంగారం స్వచ్ఛతను చూపుతుంది.

పురాతన కాలం నుంచీ బంగారం కొనుగోళ్లలో మోసాలు ఎక్కువగా జరుగుతోన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా హాల్‌మార్క్, బంగారంపై క్యారెట్ల గుర్తులను తీసుకొచ్చింది. నిజానికి అసలు సిసలైన బంగారం దొరకడం అసాధ్యం. బంగారంలో కొన్ని లోహాలను కలిపితే అది ముద్దగా అవుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు కాపర్ వంటి వాటిని వినియోగించి నకిలీ బంగారాన్ని తయారు చేస్తూ.. వినియోగదారులను మోసం చేస్తూండేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన పసిడికి గుర్తుగా.. ఈ హాల్‌మార్క్‌ని తీసుకొచ్చింది. ఈ గుర్తువుంటే.. బంగారం స్వచ్ఛంగా ఉందని అర్థం. అలాగే ఈ హాల్‌మార్క్ గుర్తుతో పాటు బంగారం కొన్న దుకాణం పేరు, పసిడి క్యారెట్ల బరువును ఖచ్చితంగా ఉండాలని సూచించింది.

ఇప్పుడంటే అన్ని బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌లు తప్పనిసరి అయిపోయాయి కానీ.. పాత కాలంలో ఇలాంటివి ఏమీ లేవు. కేవలం బంగారం రంగుని బట్టి దాన్ని గుర్తించేవారు. లేదా ఎంతో నమ్మదగిన స్వర్ణ కారుడి చేత నగలని తయారు చేయించేవారు. కాలం మారే కొద్దీ.. బంగారం స్వచ్ఛత బట్టి ఇప్పుడు గ్రేడ్‌లని ఇస్తున్నారు. 916 కేడిఎం 14కే, 18కే, 22కే, 24కేలు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు బీఐఎస్ హాల్‌ మార్క్‌ కూడా తప్పనిసరి అట. ఇదే విషయాన్ని ప్రజా ప్రయోజనాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటి ముఖ్య ఉద్ధేశ్యమేంటంటే.. వినియోగదారుడిని కల్తీ బంగారం నుంచి కాపాడడమే. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా.. బంగారం స్వచ్ఛతను తెలిపే క్యారెట్లు, హాల్‌మార్క్, బిల్లు ముఖ్యంగా ఉండాలని ఈ శాఖ స్పష్టం చేసింది.

పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..