‘ హౌదీ మోదీ ‘ అంటే ? ఎప్పుడు ? ఎక్కడ ? ఏ సమయంలో ?

what is howdy modi-check timing details of pm modi donald trump event in us, ‘ హౌదీ మోదీ ‘ అంటే ? ఎప్పుడు ? ఎక్కడ ? ఏ సమయంలో ?

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా పాల్గొననున్న ‘ హౌదీ మోదీ ‘ కార్యక్రమానికి రంగం సిధ్ధమవుతోంది. ఈ నెల 22 న టెక్సాస్ లో ‘ టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ‘ ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. అసలు ఈ కార్యక్రమ ఉద్దేశమేమిటని నిర్వాహకులను ప్రశ్నించినప్పుడు.. ఇది ఓ కమ్యూనిటీ సమ్మిట్ అని సమాధానమిచ్చారు. అంటే ఓ ‘ సామాజిక శిఖరాగ్ర సమావేశం ‘ అన్న మాట.. సుమారు 50 వేల మంది ఇండియన్ అమెరికన్లు దీనికి హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ కోసం వీరంతా మూడు వారాలముందే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. టికెట్స్ అన్నీ ఆన్ లైన్లో అమ్ముడుపోయాయి. అయితే ఫ్రీ పాసులకోసం వెయిట్ లిస్ట్ రిజిస్ట్రేషన్ ఇంకా ఓపెన్ గా ఉందని అంటున్నారు. వెయ్యిమంది వాలంటీర్లు, దాదాపు 650 స్వఛ్చంద సంస్థల సభ్యులు ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు.

‘ హౌదీ ‘ అంటే ? సౌత్ వెస్టర్న్ యుఎస్ లో సాధారణంగా ఫ్రెండ్లీగా ‘ హౌ డూ యు డూ ‘ అని పిలుచుకోవడానికి షార్ట్ లిస్ట్ గా ఇలా ‘ హౌడీ ‘ అంటారట. టెక్సాస్ లోని హూస్టన్ లో గల ఎన్ ఆర్ జీ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. సెప్టెంబర్ 22 ఆదివారం.. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. ఇది లైవ్ కవరేజీ.. మోదీ ప్రసంగంతో బాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. భారత-అమెరికావాసుల డైవర్సిటీని ప్రతిబింబించేలా 90 నిముషాల సేపు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. 400 మంది ఆర్టిస్టులు, అమెరికా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ మెంబర్లతో ‘ ఇండియన్-అమెరికన్ స్టోరీ ‘ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తారు. సుమారు 60 మంది ప్రముఖ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. యుఎస్ సెనెటర్ ఫర్ టెక్సాస్ జాన్ కార్నిన్, సీనియర్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మన్ స్టెనీ హోయర్ వంటి పాపులర్ ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *