టీఆర్ఎస్ శ్రేణుల్లో రాములమ్మ చిచ్చు..!

ప్రస్తుతం రాజకీయ విమర్శలకు కేరాఫ్ అడ్రస్ సోషల్ మీడియా మారిపోయింది. ఒకరు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలపై టార్గెట్ చేస్తే.. మరొకరు ఫేస్ బుక్ వేదికగా విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో సోషల్ మీడియా వార్ జరుగుతుందని అనుకుంటే.. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కూడా సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా అధికార టీఆర్ఎస్ పార్టీపై పవర్ పంచ్‌లు కొట్టారు. ఓ వైపు రాష్ట్రంలోని ప్రజలు అనారోగ్యంతో […]

టీఆర్ఎస్ శ్రేణుల్లో రాములమ్మ చిచ్చు..!
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 11:50 AM

ప్రస్తుతం రాజకీయ విమర్శలకు కేరాఫ్ అడ్రస్ సోషల్ మీడియా మారిపోయింది. ఒకరు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలపై టార్గెట్ చేస్తే.. మరొకరు ఫేస్ బుక్ వేదికగా విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో సోషల్ మీడియా వార్ జరుగుతుందని అనుకుంటే.. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కూడా సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా అధికార టీఆర్ఎస్ పార్టీపై పవర్ పంచ్‌లు కొట్టారు.

ఓ వైపు రాష్ట్రంలోని ప్రజలు అనారోగ్యంతో అవస్థలు పడుతుంటే.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతేకాదు.. పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని.. ఒకరు మంత్రి పదవి కోల్పోకుండా అప్రమత్తతో ఉంటే.. మరొకరు సీఎం పదవి కోసం తహతహలాడుతున్నారని.. ఇక మరోకరు మంత్రి పదవి నుంచి ఎలా తొలగించాలని ప్లాన్లు వేస్తూ… రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ లపై విరుచుకుపడ్డారు.

” తెలంగాణలో ప్రజలంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం.. కేసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. రాజకీయాల్లోనూ పాలనా పరంగానూ తనకు అందరికంటే ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్.. విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని.. ఈ విషయం జనానికి అంతుబట్టడం లేదన్నారు.

ఇక ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి.. తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో డెంగ్యూ జ్వరాలు, స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్నప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

అయితే హైదరాబాద్ మహా నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు వ్యాపిస్తున్నాయన్న వాదన ఉందని .. ఆమె అన్నారు. ఇక ఇదే అంశాన్ని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించి.. ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదన్నారు. నగరంలో జీహెచ్ఎంసీతో పాటు.. మున్సిపల్ వ్యవస్థ కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేనన్నారు. ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే.. పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ గారిమెడకు చుట్టాలని ఈటెల రాజేందర్ భావిస్తున్నట్లు పలువురు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారని విజయశాంతి పోస్ట్‌లో పేర్కొన్నారు.

మొత్తానికి రాములమ్మ చేసిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్‌కు సీఎం కేసీఆర్‌కు మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తోడుగా ఇటీవల పదవులొచ్చాయని పెద్ద మాటలు మాట్లాడుతున్నరంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇది ఈటెలను ఉద్దేశించి అన్న కామెంట్స్ అంటూ గులాభీ శ్రేణుల్లోనే గుసగుసలు మొదలయ్యాయి. ఇక పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు వ్యాపిస్తున్నాయన్న మంత్రి ఈటెల కామెంట్స్‌ కేటీఆర్‌ని టార్గెట్ చేసినవే అని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇదే అదనుగా టీఆర్ఎస్‌లో వర్గ పోరు నెలకొంటే.. కాంగ్రెస్ అవకాశం చేసుకునేందుకే విజయశాంతి ఇలా పోస్ట్ చేసి ఉంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, రాములమ్మ చేసిన ఈ పోస్ట్ ఇప్పడు.. టీఆర్ఎస్ శ్రేణుల్లో చిచ్చుకు దారితీసేలా ఉందని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే