అప్పుడు కలిసిన చేతులు.. ఇప్పుడు మారిన వ్యూహాలు!

ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ ఎగ్జాక్ట్‌ పోల్స్‌గా భావిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఇంకా వారి పోరాటాన్ని ఆపలేదు. కౌంటింగ్ డే సమయం దగ్గరపడుతున్నా.. విపక్ష పార్టీలలో మాత్రం మహాకూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సారధ్యంలో మంగళవారం హస్తినలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు గులాబ్‌నబీ ఆజాద్, మహమ్మద్ పటేల్, సీతారాం ఏచూరి, సురవరం, డీ రాజా, కనిమొళి తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వీవీ ఫ్యాట్‌ల లెక్కింపుపై వీరు చర్చలు జరిపారు. ఇది ఇలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ రేపిన ‘కలకలం’తో బీజేపీయేతర పార్టీలలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని తటస్థ పార్టీ పెద్దలు కూడా ఎగ్జిట్ పోల్స్ తర్వాత మనసు మార్చుకున్నారట. ఇక ఈ తరుణంలో విపక్ష పార్టీలు మోదీని ఎలా ఢీ కొడతాయో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *