Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్‌లు బంద్.. ‘ప్లాన్ B’ ఇదేనా..?

దసరా, బతుకమ్మ పండుగలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగలు. దీంతో.. నగరాల్లోని వారంతా.. పల్లెల్లో వాలిపోవాలని.. తమ కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని అనుకుంటారు. అందులోనూ.. బతుకమ్మ పండుగ తెలంగాణలో మరింత ముఖ్యమైనది. దాంతో.. హైదరాబాద్‌ నగరంలోని వారు తమ ఊర్లకు చేరాలనుకుంటారు. ఈ క్రమంలో.. చాలా కీలకం పనిచేసేది రవాణా. కానీ.. తెలంగాణలో మాత్రం సీన్ వేరేలా ఉంది. పండుగను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటోంది. ఆర్టీసీ సమ్మెతో.. ప్రభుత్వం గందరగోళంలో పడింది. దీని పరిష్కారానికి కేసీఆరో ‘ప్లాన్‌ B’ని ఆలోచించారు. ఇంతకీ ఏంటా ‘ప్లాన్‌ బి’! దానికి ఆర్టీసీ ఎలా రెస్పాండ్‌ అవుతుందో చూడాలి.

ఆర్టీసీ సమ్మె.. తెలంగాణలో ప్రస్తుతం హాట్‌‌గా జరుగుతోన్న చర్చ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ సర్కార్‌ ఏర్పాటు చేసిన IAS అధికారుల కమిటీ చర్చలు చేపట్టింది. తొలిదఫా చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు చేపట్టారు. IAS కమిటీ తీరుపై ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తొలుత చర్చలకు పిలిచి.. RTA అధికారులతో ఐఏఎస్‌ కమిటీ భేటీ కావడంపై మండిపడ్డారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వ త్రిసభ్య కమిటీ తీరును నిరసిస్తూ చర్చల నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు వెనుదిరిగారు. సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వ త్రిసభ్య కమిటీ మరోసారి సూచించింది. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని సమ్మె వాయిదా వేసుకోవాలని కోరింది. కానీ దానికి ఆర్టీసీ సుముఖత వ్యక్తం చేయలేదు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే.. సమ్మె ఖాయమంటున్నారు. అయితే.. దీనిపై కేసీఆర్.. ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారట. అదే ‘ప్లాన్‌ బి’. అదేంటని అనుకుంటున్నారా..? ఆ వివరాల్లోకే వెళ్దాం.

గత నెల క్రితం.. ఏపీలోని కూడా ఇదే సమస్య తలెత్తింది. దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. తమ నిర్ణయం ప్రకటించారు. దీంతో.. ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే సమస్య.. తెలంగాణలోనూ ఎదురయ్యింది. ఆర్టీసీ కార్మికులతో.. ప్రభుత్వం చర్చలు జరిపినా.. సఫలం కావడం లేదు. అసలే ఇప్పుడు పండగ సీజన్. ఆర్టీసీకి భారీగా ఆదాయం చేకూరే సమయం. ఈ టైంలో ఆర్టీసీ కార్మికులు ఇలా చేయడం.. ప్రభుత్వానికి కాస్త తలనొప్పి వ్యవహారమే. అంతేకాకుండా.. అక్టోబర్ 5 నుంచి బస్ డిపో నుంచి ఒక్క బస్‌ కూడా రాదని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.

కాగా.. ఈ విధానానికి తాత్కాలికంగా.. చెక్ పెడుతూ.. కేసీఆర్ ‘ప్లాన్ B” అమలు పరచాలని చూస్తున్నారు. దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు సూళ్లకు, కాలేజీలకు, యూనివర్శిటీలకు వారం రోజులకు పైగానే సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో.. ఆ పాఠశాలల.. కాలేజీల బస్సులు, వెహికల్స్.. ఖాళీగా ఉంటాయి. అందులోనూ.. ఆర్టీసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో.. వాటిని నడపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.