Breaking News
 • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
 • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
 • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
 • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
 • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

1528-2019ల మధ్య అయోధ్యపై వివాదాలు ఇవే..!

What is Ayodhya dispute know the full details here ahead of SC Verdict, 1528-2019ల మధ్య అయోధ్యపై వివాదాలు ఇవే..!

దాదాపు 15 శతాబ్దాల.. సుధీర్ఘం కాలంపాటు నుంచి నానున్నతోన్న.. అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య’ తీర్పు. 2.27 ఎకరాల భూమి తమదంటే.. తమదే అంటూ హిందూ, ముస్లిం వర్గాలు ఎప్పటినుంచో వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. మెఘల్ చక్రవర్తి బాబర్ కాలం నుంచి నానున్నతోన్న ఈ వివాదం.. చరిత్రేంటి..? ఎప్పటి నుంచి ఇలా మొదలయ్యింది..? మరి ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం..!

 • 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ.. బాబ్రీ మసీదును నిర్మించారు.
 • 1853: మొదటిసారి అక్కడ మత విద్వేషాలు, గొడవలు జరిగాయి
 • 1859: ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి.. హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు.
 • 1885: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు తొలిసారి కోర్టు మెట్లెక్కింది.
 • 1949: మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు.. దీంతో.. మరోసారి అక్కడ అల్లర్లు నెలకొన్నాయి.
 • 1959: అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాండా సంస్థ
 • 1981: అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున కోర్టులో వ్యాజ్యం దాఖలు
 • 1984: అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి.
 • 1986: ఫిబ్రవరి 1న హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
 • 1989: బాబ్రీ మసీదు వద్ద రామమందిర నిర్మాణానికి వీహెచ్‌పీ పునాదిరాయి వేసింది
 • 1990: అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు.
 • 1992: డిసెంబర్ 2న బాబ్రీ మసీదును కూల్చివేసిన కర సేవకులు.
 • 2010: డిసెంబర్ 30న వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది
 • 2011: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
 • 2017: ఆగష్టు 7న అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ
 • 2018: జులై 20న అయోధ్య తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం

ఇక 2019 మార్చిలో మధ్య వర్తుల కమిటీని కూడా నియమించింది సుప్రీం. ఆగష్టులో అయోధ్య వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీ కూడా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. మళ్లీ దీనిపై రోజువారీ విచారణను ప్రారంభించింది. అక్టోబర్‌‌లో ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌‌లో పెట్టింది. నవంబర్ 9కాగా అంటే ఈరోజు సుప్రీం.. అయోధ్య చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించబోతోంది.