Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

స్మోకింగ్‌ మానేస్తారా..? అయితే మీరు కింగే !

What Happens when you quit smoking, స్మోకింగ్‌ మానేస్తారా..? అయితే మీరు కింగే !

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిపోయింది. రోడ్డు మీదకు వచ్చి చూస్తే..నూటికి తొంభై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో, బీడీనో, లేక ఏదో ఒక పొగాకు ఉత్పత్తి కనిపిస్తుంది. ఇక ఫాస్ట్‌ కల్చర్‌ ఎక్కువగా ఉన్న చోట్ల ఆడవారు కూడా గుప్పుమనిపిస్తుంటారు. రోజుకొకసారి ధూమపానం చేసేవారికి, వారి ఆయువు ప్రతి ఐదు సంవత్సారాలకి.. ఒక సంవత్సరం ఆయువు తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో వెల్లడించింది. ఇక తాజా అధ్యయనాల ప్రకారం ప్రతియేటా 7 మిలియన్లకు పైగా మరణాలు కేవలం ధూమపానం వల్లే సంభవిస్తున్నాయన్నది ఊపిరి ఆగిపోయే నిజం. పొగాకు వాడకం విధానంలో మార్పు రాకపోతే..వచ్చే మరో పదేళ్ల నాటికి ఈ సంఖ్య 8 మిలియన్లకు చేరుతుందని వైద్య నిపుణుల హెచ్చరిక. అయితే, స్మోకింగ్‌ హ్యాబిట్స్‌ – పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు.. అంతే కాదు. సిగరెట్లను తయారు చేసిన కంపెనీ కూడా వాటిపై హెచ్చరిస్తుంది. అయినా పొగత్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. దీనికి కారణం ఈ సిగరెట్లలో ఉండే నికోటిన్‌ అనే పదార్థం. పొగత్రాగడం వల్ల నికోటిన్‌ రక్తంలోకి విడుదల అవుతుంది. అది శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి కణం దెబ్బతింటుంది. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో గొంతు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి.  మహిళల్లో యాదృచ్చిక గర్భస్రావాలు, శిశువుపెరుగుదలలో అడ్డంకులు, తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. పొగత్రాగడం సర్వసాధారణం..ప్రపంచంలో మిలియన్ల కొద్ది ధూమపాన ప్రియులున్నారు. వీరిలో చాలా మంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కానీ, మానలేకపోతుంటారు. ఇక అలవాటు ఎక్కువగా ఉండే వారు ధూమపానం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

* స్మోకింగ్‌ ఆపేసిన 30 నిమిషాలకు బ్లడ్‌ ప్రెజర్‌ తగ్గిపోయి, నార్మల్‌ స్థాయికి వచ్చేస్తుంది.
9 గంటల్లో రక్త ప్రవాహంలో ఉన్న కార్బన్‌ మోనాక్సైడ్‌ ఇది ఒక విషవాయువు..స్థాయిలు సగానికి పడిపోవటంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ సాధారణ స్థితికి చేరుకుంటాయి.

* రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుంది.
48 గంటల్లో గుండెపోటు కలిగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని నికోటిన్‌ మొత్తం శరీరం నుండి బయటకు పంపబడుతుంది. మీరు తినే ఆహారంలో రుచి, వాసన వంటివి మీలో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయి.

* 30 రోజుల తర్వాత..
నెల రోజుల తర్వాత శరీరంలో ఊపిరతిత్తులు, శ్వాసనాళాలు శుభ్రపడి రిలాక్స్‌ అవుతాయి. దాంతో ఊపిరితిత్తులకు ఎక్కువ ఆక్సిజన్‌ అందివ్వబడుతుంది. దాంతో శరీరంలో మొత్తం ఆక్సిజన్‌ సరఫరాకు సహాయపడుతుంది.

* రెండు నెలల తర్వాతః
రెండు నెలల్లో మీ శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది అలాగే మరో పది వారాల పాటు చాలా మెరుగ్గా కొనసాగుతుంది. దాంతో శరీరంలోని ఇతర అవయవాలకు బ్లడ్‌ సర్క్యూలేషన్‌ మరింత మెరుగ్గా జరుగుతుంది. ఫలితంగా అలసట అనిపించదు మరింత ఎనర్జిటిక్‌గా కనబడతారు.

* 8 నుండి 9 నెలల తర్వాతః 8-9 నెలల్లో పొగత్రాగడం వల్ల వచ్చే దగ్గు, శ్వాస సమస్యలు తగ్గించి ఊపిరితిత్తుల సామర్థ్యం 15శాతంకు మెరుగుపరుస్తుంది.

* ఒక సంవత్సరం తర్వాతః
స్మోకింగ్‌ వదిలేసిన ఏడాది కాలంలో గుండెపోటు, స్ట్రోక్‌ను కలిగించే ప్రమాదాన్ని మీ నుండి సగానికి తగ్గిస్తుంది. శరీరంలోని రక్తనాళాలు ఆక్సిజన్‌ను తిరిగి పొందడానికి నార్మల్‌ ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది.

* మూడు నుండి ఐదేళ్ల తర్వాత
ధూమపానం నుండి దూరం అయిన 3-5 ఏళ్ల కాలంలో మొత్తం శరీర వ్యవస్థలో గణనీయమై మార్పు వస్తుంది. నోరు, గొంతు, మూత్రాశయ క్యాన్సర్‌, గుండెపోటు ప్రమాదాలు దాదాపు తగ్గిపోతాయి.

* 10 ఏళ్ల తర్వాతః
పదేళ్ల తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్క్, పొగ త్రాగని వాళ్లకు వచ్చే లంగ్‌ క్యాన్సర్‌ రిస్క్‌ తో  సమానంగా ఉంటుంది.  అంతే కాదు.. లంగ్‌ క్యాన్సర్‌ నుండి రక్షణ కలిగిస్తుంది. కాబట్టి
స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారు వెంటనే స్మోక్‌ నిలిపేసి, ఆరోగ్యవంతమైన జీవనంతో ఆయుష్యుని కాపాడుకోండి.

Related Tags