Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

చంద్రయాన్ 2 సక్సెసా..? ఫెయిలా..?

Chandrayaan 2 Vikram Lander Updates, చంద్రయాన్ 2 సక్సెసా..? ఫెయిలా..?

చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా లాండర్ విక్రం చంద్రునిపై కాలుమోపే సమయంలో ఇస్రోతో సంకేతాల్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, మొదట్లో విక్రం క్రాష్ లాండింగ్‌తో దెబ్బతిని ఉంటుందని భావించినా, తరువాత అది క్షేమంగానే చంద్రునిపై దిగిందనీ, కాకపోతే పక్కకు ఒరిగిపోయిందనీ గుర్తించినట్టు ఇస్రో ప్రకటించింది. ఇక విక్రంతో సంబంధాలు సాధించడానికి ఇస్రో పట్టు వదలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇస్రో చంద్రయాన్ 2 కు సంబంధించి నాసా సానుకూలంగా స్పందించింది. చంద్రయాన్ విషయంలో భారత శాస్త్రవేత్తల కృషిని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక విక్రంతో సంకేతాలు పునరుద్దరించడంలో ఇస్రోకు నాసా తన సహకారాన్ని అందిస్తోంది. విక్రం జీవితకాలం కేవలం 14 రోజులే. ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయాయి. దీంతో నాసా ఇస్రోకి సహకరించడానికి నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి ఇస్రో కూడా అంగీకరించిందనీ ఇప్పటికే విక్రంతో సంబంధాల కోసం నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోందనీ చెబుతున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ గ్రౌండ్ స్టేషన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా విక్రమ్‌తో సంకేతాలు పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇక 2005లో నాసా ప్రయోగించిన స్పై శాటిలైట్ ఇమేజింగ్ భూ కేంద్రంతో సంకేతాలు నిలిచిపోగా దానిని గుర్తించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త టిల్లే మాట్లాడుతూ.. కాలిఫోర్నియాలోని డీఎస్ఎన్ స్టేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ల్యాండర్‌‌తో కమ్యూనికేషన్‌కు ప్రయత్నిస్తున్నట్టు నిర్థారించారు. నాసా చేస్తున్న ప్రయత్నాలపై ఆయన ట్వీట్ కూడా చేశారు. చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించడానికి డిఎస్‌ఎన్‌ విభాగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, గత రెండు రోజుల నుంచి సిగ్నల్ పంపుతోందని పేర్కొన్నారు.

ఇక నాసాకు చెందిన డీఎస్ఎస్ కేంద్రాలు దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో మూడు చోట్ల ఉన్నాయి. భూమికి 120 డిగ్రీల కోణంలో ఉన్న ఈ మూడు కేంద్రాల ద్వారా ఏ ఉపగ్రహానాన్నైనా అంతరిక్షంలో గుర్తించే సామర్థ్యం ఉంది. ప్రతి కేంద్రాలోనూ 26 మీటర్ల ఎత్తు 70 మీటర్ల వ్యాసం కలిగిన కనీసం నాలుగు అతిపెద్ద యాంటిన్నాలు ఉంటాయి. ఒకే సమయంలో అనేక వ్యోమనౌకలతో నిరంతరాయంగా కమ్యూనికేట్ చేయగలవు.

ఇదిలా ఉంటే మరోవైపు చంద్రయాన్ 2 ప్రయోగం పై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2 ప్రయోగం ప్రధాని నరేంద్ర మోడీ కారణంగానే విఫలమైందంటూ సరికొత్త వివాదానికి తెరతీశారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో అడుగుపెట్టడం వల్లే చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపు 12 సంవత్సరాలు తీవ్రంగా శ్రమించారని.. మోదీ రాకతో వారి కష్టం వృధా అయిందన్నారు. మోడీ ఇస్రో సెంటర్‌లో అడుగుపెట్టడం వల్ల.. శాస్త్రవేత్తలకు దురదృష్టం పట్టిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇంతకుముందు మోదీ వల్లే చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ మంత్రి అమర్ జీత్ భట్ కూడా వ్యాఖ్యానించారు. అసలు ఇంతకీ చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ అయిందా..? లేదా..? ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.