Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • కరీంనగర్ జిల్లా ఆరవ విడత హరితహారంలో భాగంగా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్..
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పు. ప్రాజెక్టుకు "జగనన్న పల్లె వెలుగు" గా పేరు మార్చిన ప్రభుత్వం . ఆదేశాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఆదేశం.
  • తెలంగాణ లో 27వేల మార్కు దాటిన కరోనా కేసులు. హైదరాబాద్ లో 20వేలకు చేరవలో కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1879. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 27612. జిహెచ్ఎంసి పరిధిలో -1422. Ghmc లో 12,633 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో 7 మృతి . 313కి చేరిన మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 11,012. డిశ్చార్జి అయిన వారు -16287. ఈ రోజు వరకూ రాష్ట్రంలో టెస్టింగ్స్ 128438.
  • రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. ఇప్పటికే సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పూర్తి. శిథిలాల తొలగింపునకు కొన్ని వారాలు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూట్ మ్యాప్ ఖరారు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.

న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ ముందు జరిగేది ఇక్కడే!

What Country celebrates, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ ముందు జరిగేది ఇక్కడే!

ప్రస్తుతం అందరూ న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ ఎలా చేద్దామా అనే ప్లాన్స్‌లో ఉన్నారు. కొంతమంది పబ్బులు, క్లబ్బులకు వెళ్తే.. మరికొందరు రోడ్లపైనే హంగామా చేస్తారు. పాత సంవత్సారానికి బైబై చెబుతూ.. కొత్త సంవత్సారానికి వెల్‌కమ్ చెబుతూంటారు. అయితే.. అన్నిదేశాల కంటే.. న్యూఇయర్ జరిగేది ఎక్కడో మీకు తెలుసా? మనకి సాయంత్రం సమయం అయ్యే సరికి ఆ దేశంలో నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి. మొదట సూర్యుడు కూడా అడుగుపెట్టేది అక్కడే.

అదెక్కడా అనుకుంటున్నారా.. అదే ‘సమోవా దేశం’. పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దేశం అందరికంటే ముందు ‘కొత్త సంవత్సరం’లోకి అడుగు పెడుతుంది. దీంతో.. అక్కడ సెలెబ్రేషన్స్‌‌ని ఓ రేంజ్‌లో చేస్తారు. కాగా.. అక్కడ జరిగిన మరో గంటలోపే న్యూజిలాండ్ ప్రజలు ‘న్యూ ఇయర్‌’ని స్వాగతిస్తారు. అనంతరం సిడ్నీ కూడా కొత్త ఏడాదిని మన కంటే 5 గంటల ముందే ఆహ్వానిస్తుంది. కాగా సిడ్నీలో జరిగే న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా హైలైట్‌గా నిలుస్తాయి. నిజం చెప్పాలంటే.. కొన్ని దేశాల ప్రజలు దీన్ని చూడటానికి అక్కడికి వేలాదిగా చేరుకుంటారు.

What Country celebrates, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ ముందు జరిగేది ఇక్కడే!

కాగా.. సమోవా దేశం తరువాత దాదాపు ఎనిమిదిన్నర గంటలకు మన దేశంలో ‘కొత్త సంవత్సరం’ వస్తుంది. మనతో పాటు శ్రీలంక దేశం కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌ చేసుకుంటారు. అయితే.. మన తర్వాత దాదాపు 43 దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, ఐరోపా, కాంగో, అంగోలా, కామెరూన్ వంటి దేశాలన్నీ న్యూఇయర్‌ వేడుకలని ఒకే సమయంలో చేసుకుంటాయి.

అయితే.. న్యూఇయర్‌ని చివరగా.. ఇంగ్లాండ్, అమెరికా, లండన్‌లలో చేస్తారు. ఇక రష్యాలో రెండు సార్లు న్యూఇయర్‌ని చేసుకుంటారు. అలాగే.. చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాంలు ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరం వేడుకలను చేసుకుంటారు.

Related Tags