గిన్నిస్‌ రికార్డు అందుకున్న అయోధ్య.. సంచలన కామెంట్లు చేసిన యోగీ..!

యూపీ సర్కార్ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని గిన్నిస్ బుక్ రికార్డలకెక్కింది. గతంలో కుంభమేళాలో చేసిన ఏర్పాట్లతో ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా అయోధ్యలో దీపావళి వేడుకలను నిర్వహించి ప్రపంచ రికార్డులకెక్కింది. దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో దీపోత్సవ్ పేరుతో ప్రత్యక కార్యక్రమానికి యోగీ సర్కార్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలోని సరయు నది ఒడ్డున దిపోత్సవం కార్యక్రమాన్ని శనివారం […]

గిన్నిస్‌ రికార్డు అందుకున్న అయోధ్య.. సంచలన కామెంట్లు చేసిన యోగీ..!
Follow us

| Edited By:

Updated on: Oct 27, 2019 | 6:13 AM

యూపీ సర్కార్ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని గిన్నిస్ బుక్ రికార్డలకెక్కింది. గతంలో కుంభమేళాలో చేసిన ఏర్పాట్లతో ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా అయోధ్యలో దీపావళి వేడుకలను నిర్వహించి ప్రపంచ రికార్డులకెక్కింది.

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో దీపోత్సవ్ పేరుతో ప్రత్యక కార్యక్రమానికి యోగీ సర్కార్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలోని సరయు నది ఒడ్డున దిపోత్సవం కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించారు. ప్రపంచంలోనే అతి పెద్ద నూనె దీపాల ప్రదర్శనగా దీపోత్సవం-2019 గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఈ కార్యక్రమానికి యూపీ గవర్నర్ ఆనందీ బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఫిజీ మంత్రి వీణా భట్నాగర్‌, పలువురు మంత్రులు, నేతలు హాజరయ్యారు. అనంతరం నయా ఘాట్ వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపోత్సవం కార్యక్రమంలో 2500 మంది కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శించారు. అంతేకాదు ఫిజీ మంత్రి వీణా భట్నాగర్.. “మంగళ్ భవన్.. అమంగల్ హారీ..” ఆధ్యాత్మిక పాటను పాడుతూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన యోగీ ఆదిత్యానాథ్.. దేశంలో బీజేపీ ప్రభుత్వాలు రామ రాజ్య స్థాపన దిశగా పరిపాలిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి నుంచి ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేస్తున్నాయని తెలిపారు. రామ రాజ్య భావన గురించి వివరిస్తూ, ప్రాంతం, మతం, కులం, జాతి వంటి వ్యత్యాసాలేవీ లేకుండా, వివక్ష చూపకుండా పరిపాలించే విధానమే రామ రాజ్యమన్నారు. పేదలు, రైతులు, యువత సహా అందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వసుధైక కుటుంబం అనే భావనతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఇక పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ.. ఘాటైన హెచ్చరికలు చేశారు. మేం వేరే వారి విషయంలో జోక్యం చేసుకోమని… కానీ మా జోలికి వస్తే మాత్రం అందుకు తగ్గట్టుగా ధీటైన సమాధానం చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!