విండీస్ ముంగిట భారీ లక్ష్యం… విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్!

రెండో టెస్టులో టీమిండియా ప్రత్యర్థి ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానె(64నాటౌట్‌; 109 బంతుల్లో 8×4, 1×6), హనుమ విహారి(53; 76బంతుల్లో 8×4) అర్ధశతకాలతో రాణించి కీలక ఇన్నింగ్‌ ఆడారు. విండీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ జోడీ శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతానికి మూడో […]

విండీస్ ముంగిట భారీ లక్ష్యం... విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:59 AM

రెండో టెస్టులో టీమిండియా ప్రత్యర్థి ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానె(64నాటౌట్‌; 109 బంతుల్లో 8×4, 1×6), హనుమ విహారి(53; 76బంతుల్లో 8×4) అర్ధశతకాలతో రాణించి కీలక ఇన్నింగ్‌ ఆడారు. విండీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ జోడీ శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతానికి మూడో రోజు ఆటలో ఇంకా 16 ఓవర్లు మిగిలి ఉన్నాయి. భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా.. పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఆరంభంలోనే కట్టడి చేయాలని భావిస్తోంది. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌ మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. మూడో రోజు అట ముగిసే సమయానికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.