West Godavari : జోరుగా సాగుతున్న పందాలు.. కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు..

సంక్రాంతి వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు. పల్లెలు మొత్తం కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబవుతాయి. అయితే పండగతో పాటు పందాలు కూడా ఎక్కువగానే..

West Godavari : జోరుగా సాగుతున్న పందాలు.. కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 8:27 PM

West Godavari : సంక్రాంతి వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు. పల్లెలు మొత్తం కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబవుతాయి. అయితే పండగతో పాటు పందాలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. పోలీసులు నిఘా పెట్టినా కూడా గుట్టుచప్పుడు కాకుండా పందేలరాయుళ్లు కోళ్లపందాలు నిర్వహిస్తూనే ఉంటారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.

ఈ దాడుల్లో డోన్ మండలం సీసం గుంతలలోని కొండల్లో ఉన్న కోడి పందాల స్థావరాల్లో పందాలు ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు బైక్‌లు, మూడు పుంజులు, రూ.4 వేలు, 8 సెల్‌ఫోన్లు, నాలుగు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీటితో పాటు మరికొన్ని స్థావరాలపైన కూడా పోలీసులు దాడి నిర్వహించారు. కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని మొదటినుంచి పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా లెక్క చేయకుండా చాలా మంది ఇలా పోలీసుల కళ్ళు గప్పి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోడి పందాల స్థావరాల వద్ద మరింత నిఘా పెట్టామని పోలీసులు తెలుపుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Temples Security: ఆలయాల భద్రతలో మ్యాపింగ్‌, సీసీ కెమెరాలు కీలకం: మీడియాతో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌