Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

బెంగాలీ మూవీలో గ్లామరస్ ఎంపీ..దర్శకుడు మంత్రి !

లోక్ సభలో మోస్ట్ గ్లామరస్ ఎంపీ అనగానే తనే గుర్తుకు వస్తుంది. ఆమె ఎవరో కాదు..ప్రముఖ బెంగాలీ హీరోయిన్‌ నుస్రత్‌ జహాన్‌. తన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న పేరు, ఫాలోవర్స్‌ చాలా ఎక్కువ. అసలు విషయం ఏంటంటే...
west bengal minister bratya basu dons directors hat, బెంగాలీ మూవీలో గ్లామరస్ ఎంపీ..దర్శకుడు మంత్రి !

లోక్ సభలో మోస్ట్ గ్లామరస్ ఎంపీ అనగానే తనే గుర్తుకు వస్తుంది. ఆమె ఎవరో కాదు..ప్రముఖ బెంగాలీ హీరోయిన్‌ నుస్రత్‌ జహాన్‌. తన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న పేరు, ఫాలోవర్స్‌ చాలా ఎక్కువ. గత ఏడాది క్రితమే సినిమాల నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. బసీర్హత్‌ నుంచి పోటీ చేసి 3లక్షల 50వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్వయంగా బెంగాలీ ముస్లిం మతస్థురాలైన నుస్రత్‌.. జైన మతస్తుడైన ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా కట్టుబాట్లను లెక్క చేయకుండా ప్రజలతో కలిసిమెలసి పోతున్నారు. కొన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. అది కూడా ఓ మంత్రి దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించబోతున్నారు.

బెంగాల్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బ్రత్యా బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిక్షనరీ’ మూవీలో నుస్రత్ నటిస్తోంది. కథంతా ఆమె చుట్టూనే తిరిగే ఈ చిత్రంలో రోజురోజుకూ కనుమరుగువుతున్న మానవ సంబంధాలను చూపుతున్నారట. ఇది సందేశాత్మక చిత్రమని చెబుతున్నారు. ప్రముఖ బంగ్లాదేశీ నటుడు మొషార్రఫ్‌ కరీమ్‌ కూడా ఇందులో నటిస్తున్నాడు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లిన బసు 30 సినిమాల్లో నటించారు. 2010లో ‘తారా’ చిత్రం తర్వాత కెమెరాకు దూరంగా ఉన్నారు. తాజాగా అందాల ఎంపీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై బెంగాల్ అభిమానులు, నెటజన్లతో పాటు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Related Tags