కోవిడ్-19.. మమత, కేంద్రం మధ్య ఉధృతమవుతున్న వార్

లాక్ డౌన్ ఆంక్షలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నీరు గారుస్తోందని, నిబంధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోందని వఛ్చిన వార్తలతో సీరియస్ అయిన కేంద్రం రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపింది.

కోవిడ్-19.. మమత, కేంద్రం మధ్య ఉధృతమవుతున్న వార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2020 | 6:16 PM

లాక్ డౌన్ ఆంక్షలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నీరు గారుస్తోందని, నిబంధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోందని వఛ్చిన వార్తలతో సీరియస్ అయిన కేంద్రం రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపింది. బెంగాల్ లో ఏయే జిల్లాల్లో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోందో, ఏ జిల్లాల్లో లేదో ఫీడ్ బ్యాక్ అందించేందుకు హోమ్ శాఖ వీటిని పంపినప్పటికీ.. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ బృందాలకు సహకరించే ప్రసక్తే లేదంటున్నారు. కేంద్ర నిర్ణయాన్ని దాదాపు సవాల్ చేస్తూ ఆమె నిన్న ఏకంగా ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాని ఉద్దేశించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కోల్ కతా ను విజిట్ చేసిన ఓ కేంద్ర బృందంలోని సభ్యుడైన అపూర్వ చంద్ర.. తమకు ఈ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన మంగళవారం హోం శాఖకు ఫోన్ ద్వారా తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కేంద్ర బృందాలకు ఆయా ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా-ఈ బృందాలను తమ రాష్ట్రానికి పంపడం ప్రోటోకాల్ ని ఉల్లంఘించడమే అని మమతా బెనర్జీ ఆరోపించారు. అసలు ఈ టీమ్ వాచ్ లిస్ట్ లో తమ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు ఉన్నాయని, వీటిలో మూడింటిలో ఈ 14 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆమె చెప్పారు. కేంద్ర బృందాలను తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలకు ఎందుకు పంపలేదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇలా ఉండగా.. మహారాష్ట్రలోని పూణె, రాజస్థాన్ లోని జైపూర్, బెంగాల్ లో కోల్ కతా, హౌరా, మిడ్నపూర్ ఈస్ట్, 24 పరగణాలు నార్త్, డార్జిలింగ్, కలింపాంగ్, జల్పాయ్ గురి, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతాలకు కేంద్ర బృందాలను పంపారు.