కరోనా పోరులో ప్రాణాలొదిలిన యువ అధికారిణి

కరోనా పోరులో ఫ్రంట్ వారియర్స్ సైతం ప్రాణాలొదులుతున్నారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు అహార్నిశలు శ్రమించిన ఓ యోధురాలు అశువులు బాసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

కరోనా పోరులో ప్రాణాలొదిలిన యువ అధికారిణి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 14, 2020 | 3:56 PM

కరోనా పోరులో ఫ్రంట్ వారియర్స్ సైతం ప్రాణాలొదులుతున్నారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు అహార్నిశలు శ్రమించిన ఓ యోధురాలు అశువులు బాసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. .

కరోనాపై పోరాటంలో ముందువరుసలో నిలిచిన యువ ప్రభుత్వ అధికారిణి వైరస్‌ బారినపడి మృతిచెందింది. 39 ఏళ్ల దేబ్‌దత్త రే హూగ్లీ జిల్లా చందన్‌నగర్‌ డిప్యూటీ మేజిస్ట్రేట్‌ విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా నిద్ర రాత్రులు మాని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఊరూర పర్యవేక్షించారు. హూగ్లీ జిల్లాలోకి రైళ్ల ద్వారా వలస కార్మికులు తరలించే ప్రక్రియను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదే క్రమంలో విధి నిర్వహణలో ఉండగానే ఆమెకు జూలై మొదటి వారంలో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఈ మేరకు దేబ్‌దత్త రే ఉత్తర కోల్‌కత్తాలోని తన నివాసంలో క్వారంటైన్‌లోనే ఉండిపోయారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. కుటుంబ సభ్యులు ఆదివారం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేబ్‌దత్త రే సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా, ఆమెకు భర్త నాలుగేళ్ల కుమారుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దేబ్‌దత్త రే మృతిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేబ్‌దత్త రే మరణం తీవ్రంగా కలచివేసిందన్న సీఎం.. ఆమె స్ఫూర్తి, త్యాగాన్ని మరువలేనిదన్నారు. ఆమె కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని మమతా హామీ ఇచ్చారు.