బెంగాల్‌లో దారుణం.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా..

వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో.. హుగ్లీలోని ఖనకుల్‌ బ్లాక్‌లో అధికార టీఎంసీ పార్టీకి బీజేపీకి మధ్య..

బెంగాల్‌లో దారుణం.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా..
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 3:30 PM

వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో.. హుగ్లీలోని ఖనకుల్‌ బ్లాక్‌లో అధికార టీఎంసీ పార్టీకి బీజేపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య జెండా ఎగురవేస్తున్స సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు జెండాలను ఎగురవేస్తున్నా సమయంలో.. బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్త తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు విడిచాడు. కాగా, గత నెలలో ఓ బీజేపీ కార్యకర్త చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్య కాదని.. టీఎంసీ కార్యకర్తలే హత్య చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతుకు ముందు ఓ ఎమ్మెల్యే కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అయితే సదరు ఎమ్మెల్యేది కూడా టీఎంసీ కార్యకర్తలు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. గత కొద్ది నెలలుగా వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు