తనకు హెచ్‌ఐవీ ఉందని ఒప్పుకొన్న రగ్బీ లెజెండ్!

హెచ్‌ఐవీ అనేది ఎంత ప్రాణాంతకమైన వ్యాధో అందరికి తెలిసింది. దీన్ని పూర్తిగా నయం చేయగలిగే మెడిసిన్‌ను ఇంకా కనిపెట్టలేదు. ఈ డిసీజ్‌తో సఫర్ అయ్యేవాళ్లు బయటకు చెప్పుకోడానికి ఇబ్బంది పడతారు. ప్రపంచం చిన్న చూపు చూస్తుందని..వెలి వేస్తుందని వారి భయం. అందుకే వారిలో వారే మదనపడుతూ ఉంటారు. అయితే తనకు హెచ్‌ఐవీ ఉందని వేల్స్‌కు చెందిన రగ్బీ జట్టు మాజీ కెప్టెన్‌ గారెత్‌ థామస్‌ ప్రకటించాడు. చాలా ఏళ్ల పాటు ఈ విషయాన్ని తనలోనే దాగి ఉంచుకున్నానని […]

తనకు హెచ్‌ఐవీ ఉందని ఒప్పుకొన్న రగ్బీ లెజెండ్!
‘Courageous’ Gareth Thomas breaks down in tears hugging husband during Ironman race hours after revealing HIV battle
Follow us

|

Updated on: Sep 16, 2019 | 4:08 AM

హెచ్‌ఐవీ అనేది ఎంత ప్రాణాంతకమైన వ్యాధో అందరికి తెలిసింది. దీన్ని పూర్తిగా నయం చేయగలిగే మెడిసిన్‌ను ఇంకా కనిపెట్టలేదు. ఈ డిసీజ్‌తో సఫర్ అయ్యేవాళ్లు బయటకు చెప్పుకోడానికి ఇబ్బంది పడతారు. ప్రపంచం చిన్న చూపు చూస్తుందని..వెలి వేస్తుందని వారి భయం. అందుకే వారిలో వారే మదనపడుతూ ఉంటారు.

అయితే తనకు హెచ్‌ఐవీ ఉందని వేల్స్‌కు చెందిన రగ్బీ జట్టు మాజీ కెప్టెన్‌ గారెత్‌ థామస్‌ ప్రకటించాడు. చాలా ఏళ్ల పాటు ఈ విషయాన్ని తనలోనే దాగి ఉంచుకున్నానని తెలిపాడు. 45 ఏళ్ల థామస్‌ 1995 నుంచి 2007 వరకు వేల్స్‌ రగ్బీ జట్టు తరఫున 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ విషయంపై తనకు బెదిరింపు మెయిల్స్‌ వస్తున్నాయని, అందుకే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని పేర్కొన్నాడు. ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోలో అతడు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. హెచ్‌ఐవీ ఉన్నందున తనను సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని, ఈ సందర్భంగా అండగా అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తనకు సోకిన వ్యాధి పట్ల నిరంతరం పోరాటం చేస్తానని, హెచ్‌ఐవీపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తానని థామస్‌ వివరించాడు. ప్రజలు తన గురించి ఏమనుకుంటారోననే ఇన్నేళ్లు ఈ రహస్యాన్ని బయటపెట్టలేదని, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని వెల్లడించాడు. ఇదిలా ఉండగా వేల్స్‌ జట్టు మరోవారంలో తొలిసారి రగ్బీ ప్రపంచకప్‌లో ఆడే సమయంలో థామస్‌ ఈ విషయాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అతడు పోస్టు చేసిన వీడియోకి పలువురు నుంచి ప్రశంసలతో పాటు అభినందనలు అందుతుండటం విశేషం. గ్రౌండ్‌లోనే కాదు నీవు బయట కూడా లెజెండే అంటూ థామస్‌కు నెటిజన్లు ధైర్యం చెప్తున్నారు.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..