రోమ్ లో బయటపడిన అలనాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అగ్నిపర్వతం లావాలో చిక్కుకుని, శిథిలమైనా చెక్కు చెదరకుండా !

ఇటలీ లోని పొంపీ ప్రాంతంలో వేల యేళ్ళనాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి బయట పడింది. పోలీ క్రోమ్స్ ప్యాటర్న్స్ తో డెకరేట్ చేసిన ఈ స్నాక్ బార్ ఎలా బయటపడిందన్నదిఆశ్చర్యం కలిగించక మానదు

రోమ్ లో బయటపడిన అలనాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అగ్నిపర్వతం లావాలో చిక్కుకుని, శిథిలమైనా చెక్కు చెదరకుండా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 27, 2020 | 6:29 PM

ఇటలీ లోని పొంపీ ప్రాంతంలో వేల యేళ్ళనాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి బయట పడింది. పోలీ క్రోమ్స్ ప్యాటర్న్స్ తో డెకరేట్ చేసిన ఈ స్నాక్ బార్ ఎలా బయటపడిందన్నదిఆశ్చర్యం కలిగించక మానదు. 79 ఏడీ కాలంలో వెసూవియస్ అగ్నిపర్వతం బద్దలై నప్పుడు వెలువడిన లావా, బూడిదలో ఈ బార్ కూడా కూరుకుపోయింది. పురాతత్వ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఇది కనబడింది. నాడు ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు 2 వేల మందికి పైగా మరణించి ఉంటారని భావిస్తున్నారు.

మెనులో జంతు సంబంధ ఆహార పదార్థాల పట్టిక, వాటి అవశేషాలు, రోస్టర్ కూడా కనుగొన్నారు. జార్లు , మట్టి కుండల్లో వివిధ జంతువుల అవశేషాలు కూడా కనిపించాయట..

Video Courtesy: The Guardian