ఇండియాలో విదేశీ యూనివర్సిటీలు, అమెరికా హర్షం

ఇండియాలో విదేశీ యూనివర్సిటీలను అనుమతిస్తూ..అదేసమయంలో విదేశాల్లో భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ విధానం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది.

ఇండియాలో విదేశీ యూనివర్సిటీలు, అమెరికా హర్షం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2020 | 1:30 PM

ఇండియాలో విదేశీ యూనివర్సిటీలను అనుమతిస్తూ..అదేసమయంలో విదేశాల్లో భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ విధానం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానం స్వాగతించదగినదని అమెరికా విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ ఎఫైర్స్ కమిటీ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ అద్యక్షతన గత నెల 29 న సమావేశమైన కేంద్ర కేబినెట్ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించింది. అందులో భాగంగా ఈ ప్రతిపాదన చేశారు.

స్కూలు, హయ్యర్ ఎడ్యుకేషన్ రంగాల్లో పెద్దఎత్తున సంస్కరణలను చేపట్టాలని ఈ విధానంలో నిర్దేశించారు. ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్ లను ఇండియాలో ఓపెన్ చేయాలన్న అంశానికి ఈ విధానంలో అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కింద.. సుమారు రెండు కోట్లమంది డ్రాపౌట్స్ ని (మధ్యలో బడి మానేసిన పిల్లలను) తిరిగి మెయిన్ స్ట్రీమ్ లోకి తేవాలని నిర్దేశించారు.