ఆరు నెలల తర్వాత ఆ మార్క్‌ను తాకింది..

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన సూచీలు... ట్రేడింగ్ చివర్లో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్లు జంప్‌చేసి 39,074 వద్ద

ఆరు నెలల తర్వాత ఆ మార్క్‌ను తాకింది..
Follow us

|

Updated on: Aug 26, 2020 | 4:47 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన సూచీలు… ట్రేడింగ్ చివర్లో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్లు జంప్‌చేసి 39,074 వద్ద ముగిసింది. వెరసి ఆరు నెలల తదుపరి 39,000 పాయింట్ల మార్క్‌ ఎగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 77 పాయింట్లు లాభపడి 11,550 వద్ద స్థిరపడింది.

వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకోవడంతో దేశీయ మదుపరుల్లో సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లైంది. అయితే బీఎస్ఈ సెన్సెక్స్ లో కొన్ని బ్యాంకింగ్ షేర్లు దూకుడు ప్రదర్శించాయి. భారతీ ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్ మారుతి సుజకి వంటివి కొంత నష్టాలను చవిచూశాయి.