ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక..!

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు జర భద్రం.. ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందని.. ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇక ఈ మెసేజ్ చూసిన వారందరూ ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ అవన్నీ వట్టి […]

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక..!
Follow us

|

Updated on: Nov 02, 2019 | 1:06 AM

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు జర భద్రం.. ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందని.. ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది.

ఇక ఈ మెసేజ్ చూసిన వారందరూ ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ అవన్నీ వట్టి పుకార్లు, ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ నుంచి ఎటువంటి కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించరాదని ఖాతాదారులను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ద్వారా ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

మరోవైపు ఆ సందేశంలో ఇచ్చిన వెబ్‌సైట్‌ను కూడా పరిశీలిస్తే కావాలని ఎవరో ఉద్దేశపూర్వకంగానే రూపొందించినట్లు ఫ్యాక్ట్ చెక్‌లో తేలిపోయింది. ముఖ్యంగా గవర్నమెంట్ వెబ్‌సైట్స్ అన్నీ .gov.in ద్వారా డోమైన్ పూర్తి అవుతోంది. ఇకపోతే ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్‌సైట్  www.epfindia.gov.in.

అంతేకాకుండా ఈ ఫేక్ వెబ్‌సైట్ డొమైన్ ద్వారా మరికొన్ని నిజాలు బయటపడ్డాయి. గతంలో ఫేక్ హోండా షోరూమ్ వెబ్‌సైట్‌గా 300 యాక్టివాలు దివాళీ ఆఫర్‌లో ఫ్రీగా ఇస్తున్నట్లు జనాలను నమ్మించిందట.  కాబట్టి ప్రజలు ఇలాంటి ఫేక్ వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ ఈపీఎఫ్ఓ సంస్థ హెచ్చరిస్తోంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!