ప్రముఖ ఫుట్‌బాలర్‌ జ్లాటన్‌ ఇబ్రహీమోవిచ్‌ అరుదైన చరిత్ర సృష్టించాడు

అత్యంత పెద్ద వయసులో యూరోపియన్‌ ఛాంపియన్‌ క్వాలిఫయర్‌ ఆడిన ఆటగాడిగా ఈ స్వీడిష్‌ స్టార్‌ స్ట్రయికర్‌ రికార్డు నెలకొల్పాడు

యూరో 2024 గ్రూప్‌ గేమ్‌లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో  సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఇబ్రహీమోవిచ్‌

41 సంవత్సరాల 5 నెలల 21 రోజుల వయసులో మ్యాచ్‌ ఆడిన ఆటగాడిగా రికార్డు

గతంలో ఈ రికార్డు ఇటాలియన్‌ గోల్‌కీపర్‌ డినో జోఫ్‌ పేరిట ఉండేది

1983లో మే 29న స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో డినో 41 ఏళ్ల 3 నెలల ఒక్క రోజు వయసులో యూరో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడాడు

తాజాగా సీరీ ఏలో గోల్‌ సాధించి అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ఇబ్రహీమోవిచ్‌ రికార్డుల్లోకెక్కాడు

జర్మనీలో 2024లో జరిగే యూరో కప్‌ ఫైనల్లో ఇబ్రహీమోవిచ్‌ ఆడితే 42 ఏళ్ల వయసులో యూరో కప్‌ ఫైనల్స్‌ ఆడిన అత్యంత పెద్ద వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు