టెస్ట్ క్రికెట్‌లో అరుదైన అద్భుతం.. తండ్రి రికార్డ్‌ను బ్రేక్ చేసిన కొడుకు..

వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ కుమారుడు తేజ్‌నారాయణ్‌ చరిత్ర సృష్టించాడు.

జింబాబ్వేతో జరిగిన బులవాయో టెస్టులో తేజ్‌నారాయణ డబుల్ సెంచరీ సాధించాడు.

తేజ్‌నారాయణ్‌ చంద్రపాల్‌ డబుల్‌ సెంచరీ చారిత్రాత్మకంగా మారింది.

క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి తండ్రీకొడుకులుగా నిలిచారు.

గతంలో శివనారాయణ్ చంద్రపాల్ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించగా, ఇప్పుడు ఆయన కొడుకు కూడా ఈ ఘనత సాధించాడు.

తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ సిక్సర్ కొట్టి తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.

465 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌ నుంచి స్లో డబుల్‌ సెంచరీ ఇదే.

తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తన తండ్రి శివనారాయ అత్యుత్తమ టెస్ట్ స్కోర్‌ను కూడా బ్రేక్ చేశాడు.

తేజ్‌నారాయణ ఈ మ్యచ్‌లో 207 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆయన తండ్రి అత్యధిక టెస్టు స్కోరు 203 పరుగులే.