ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కొద్దిరోజులే ఉంది.

రాజస్థాన్ రాయల్స్ ఈసారి టైటిల్ గెలవాలని కోరుకుంటోంది

అయితే, ఈ జట్టుకు యుజ్వేంద్ర చాహల్ కెప్టెన్‌గా మారినట్లు వరుస ట్వీట్లు సందడి చేశాయి.

రాజస్థాన్ రాయల్స్ యుజ్వేంద్ర చాహల్ వీడియోను ట్వీట్ చేసింది.

అకౌంట్ హ్యాక్ చేస్తానని యుజ్వేంద్ర ఆ వీడియోలో పేర్కొన్నాడు.

అక్కడే అసలైన ట్విస్ట్ వెలుగు చూసింది.

యుజ్వేంద్ర ట్విట్టర్ ఖాతా నుంచి తనను తాను జట్టు కెప్టెన్ చేసినట్లు హ్యాకర్లు ట్వీట్స్ చేశారు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ ఉన్న సంగతి తెలిసిందే.