జాజికాయలు అనేవి భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు

జాజికాయలతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే జాజికాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబ్దకం, గ్యాస్‌ సమస్య, జీర్ణ సమస్యలు తగ్గుతాయి

జాజికాయ పొడిని ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు పదార్థం తొలగిపోతుంది

జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంతాలకు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది

జాజికాయ నూనె నొప్పులకు ఎంతగానో ఉపయోగపడనుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు

ఇక నిద్రలేమితో బాధపడుతున్న వారికి రాత్రి భోజనం సమయంలో పొడిని తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది

జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది