మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌.

ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే రూపం, ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తోందీ బ్యూటీ..

తాజాగా బెల్లంకొండ గణేష్ తో వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’..

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే.

మీ అభిమాన నటులు ఎవరు? అభిమాన నటులు చాలామంది ఉన్నారు. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని.