చింత చిగురుని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట రాల్‌ను తగ్గించి.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలను కలిగిన చింత చిగురు గొంతునొప్పి, మంట, వాపులను తగ్గించగలదు.
చింత చిగురులోని ఫైబర్ అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను నిరోధించగలదు.
శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను చింతచిగురు అందించగలదు.
కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఒక మంచి ఔషధం.
ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి చింతచిగురు మేలు చేస్తుంది.