ఉదయం తినే ఆహారం ఆ రోజంతా ఉల్లాసంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఉదయపు ఆహారం, పౌష్టికాహారం పేగు ఆరోగ్యానికి మంచిది.

ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కానీ ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తినకూడదు.

విపరీతంగా ఆకలిగా ఉన్నప్పుడు ఈ క్రింది వాటిలో కొన్నింటిని తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

మీరు ఖాళీ కడుపుతో మసాలా పదార్ధాలు ఏదైనా తింటే.. మీరు ఉదర సమస్యలను ఎదుర్కొంటారు.

ఖాళీ కడుపుతో పెరుగు తీసుకోకూడదు. ఇందులో ఉండే బాక్టీరియా కడుపులోని యాసిడ్‌లకు ఆటంకం కలిగిస్తుంది.

చలికాలంలో ఖాళీ కడుపుతో జామపండు తింటే  జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. కడుపు నొప్పి కూడా రావచ్చు.

టమోటాలో ఉండే టానిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ యాసిడ్‌తో చర్య జరుపుతుంది. కారణంగా కడుపులో చికాకు మరియు అసౌకర్యంగా ఉంటుంది

ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల శరీరంలో ఎసిడిటీ స్థాయిలు పెరుగుతాయి. కారణంగా రోజంతా అజీర్ణం లేదా గుండెల్లో మంట సమస్యను ఎదుర్కొంటారు.

 ఖాళీ కడుపుతో కూరగాయలు తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో మెగ్నీషియం , పొటాషియం స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి అనవసరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు.