మొదటిసారి శృంగారం విషయానికి వస్తే మగవాళ్లకే కాదు ఆడవాళ్లకు కూడా అనేక సందేహాలు ఉంటాయి.
మొదటిసారి లైంగిక సంపర్కం అనేది బలవంతంగా లేదా బెదిరింపు, లేదా ఇష్టం లేకుండా చేయడం వల్ల దీర్ఘకాలిక శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది.
మొదటి సారి లైంగికంగా కలిసే సమయంలో ఇద్దరూ కలిసి మనసువిప్పి మాట్లాడుకోవాలి. ఏదైనా అసౌకర్యం ఉంటే వెంటనే తెలియజేయాలి.
మొదటిసారిగా శారీరకంగా కలుస్తున్నప్పుడు లేదా రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొన్నప్పుడు సేఫ్టీ కోసం ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి.
మొదటి రాత్రి అనేది అందరికి అద్భుతమైన అనుభూతిగా ఫీలవుతారు. ఎలాంటి అసంతృప్తికి చోటు లేకుండా లైఫ్ పార్టనర్ ఇష్టానికి తగినట్లుగా నడుచుకోవాలి.
మొదటి సారి శృంగారం చేయడం అనేది అదేదో తప్పుగా భావిస్తుంటారు. దీని గురించి గిల్టీగా భావించాల్సిన అవసరం లేదు.
పెనెట్రేటివ్ సెక్స్ అనేది స్త్రీలు క్లైమాక్స్‌కు వచ్చే అరుదైన సంఘటన. కాబట్టి, ఏ ప్రాంతాలు మీ భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి మరియు వాటిని గరిష్ట స్థాయికి చేరుస్తాయో మీరు గుర్తించాలి.
శృంగారానికి ముందు మరియు తరువాత, మూత్ర విసర్జన చేయండి మరియు జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
మొదటి సారి కలిసినప్పుడు స్త్రీలకు తప్పనిసరిగా రక్తస్రావం అవుతుందనేది అపోహ. మొదటిసారి లైంగిక రక్తస్రావం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు.