సరోగసీ ద్వారా బిడ్డను కన్నా, పసిబిడ్డను దత్తతకు తెచ్చుకున్నాచనుబాలు పట్టే వీలుంటుంది అంటున్నారు నిపుణులు

దీనికోసం బిడ్డను తెచ్చుకొనే కొద్దినెలల ముందు నుంచే మానసికంగా సిద్ధం కావాలి

పాపాయికి మీరే తల్లి అని మనస్ఫూర్తిగా నమ్మి బిడ్డ ఆకలి తీర్చాల్సిన బాధ్యత మీమీద ఉందని నిర్ణయించుకోవాలి

నిజానికి మానసిక ప్రక్రియ ద్వారా పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది

ప్రెగ్నెన్సీ  సమయంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లతో పాటు ప్రొలాక్టిన్‌ అనే హార్మోన్‌ కూడా ఎక్కువ స్థాయిలో విడుదల అవుతుంది

బిడ్డ పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్‌ స్థాయులు అలాగే ఉండి మిగతా రెండు హార్మోన్ల స్థాయులు తగ్గిపోతాయి

ప్రొలాక్టిన్‌ పాపాయి అవసరానికి తగ్గట్టు పాల తయారీకి ఉపయోగపడుతుంది

మీరు బిడ్డను దత్తత లేదా సరోగసీ ద్వారా  తెచ్చుకునేందుకు నెలల ముందే డాక్టర్లు సంప్రదిస్తే ఈ తరహా హార్మోన్‌ థెరపీని సూచిస్తారు

ఇక పసిస్పర్శ తగిలినప్పుడు, బిడ్డ రొమ్మును చీకుతున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవడం వల్ల పాలు ధారకడతాయి

అయితే ఈ పద్ధతి అందరికీ వీలవుతుందని చెప్పలేం