యెస్‌ బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.266.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలం లాభం రూ.150.77 కోట్లతో పోల్చితే ఇది 77 శాతం అధికం. 

సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.6,408.53 కోట్ల నుంచి రూ.5,632 కోట్లకు తగ్గింది.

నికర వడ్డీ ఆదాయం కూడా రూ.2,560 కోట్ల నుంచి రూ.1,764 కోట్లకు చేరింది. 

బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 15.36 శాతం నుంచి 14.65 శాతానికి తగ్గాయి.