హర్భజన్ నుంచి బ్రావో వరకు.. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది వీరే..!

హర్బజన్ సింగ్: టర్బొనేటర్‌గా పేరొందిన హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ తన 23 ఏళ్ల కెరీర్‌ను డిసెంబర్‌లో ముగించాడు.

ఏబీ డివిలియర్స్: దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

డ్వేన్ బ్రావో: వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు అంతకుముందు క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. కానీ, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2021లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

డేల్ స్టెయిన్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా ఈ ఏడాది అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటెర్మెంట్ ప్రకటించాడు.

అస్గర్ ఆఫ్ఘన్: పాకిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఓడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఉపుల్ తరంగ: శ్రీలంక వెటరన్ ఓపెనర్ ఉపుల్ తరంగ ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.