భారత్‌పై అత్యధిక భాగస్వామ్యం.. స్మిత్-హెడ్ జోడీల అరుదైన రికార్డ్..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీతో మెరిశాడు.

స్మిత్ టెస్టు కెరీర్ లో 31వ టెస్టు సెంచరీతో మెరిశాడు.

అలాగే భారత్‌పై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

భారత్‌పై స్మిత్ 37 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు సాధించాడు.

భారత్‌పై జో రూట్ 45 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు, గ్యారీ సోబర్స్ 30 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు చేశారు.

వివ్ రిచర్డ్స్ 41 ఇన్నింగ్స్‌ల్లో 8, రికీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు సాధించారు.

స్మిత్ రికార్డు సెంచరీ సాధించడమే కాకుండా ట్రావిస్ హెడ్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు.

76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్, హెడ్ 285 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

భారత్‌తో టెస్టులో ఆస్ట్రేలియాకు నాలుగో వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.

దీంతో పాటు భారత్‌పై టెస్టు క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేసిన రికార్డును కూడా స్మిత్ లిఖించాడు.