డబ్ల్యూపీఎల్‌లో దూకుడు పెంచిన రూ.10లక్షల ప్లేయర్.. షాక్‌లో బ్యాటర్లు..

ఐపీఎల్ తరహాలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది.

WPL మొదటి సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

ఈ వియంలో 27 ఏళ్ల భారత స్పిన్నర్ సైకా ఇషాక్ కీలక పాత్ర పోషించింది.

టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఆడిన మూడో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

మొదట షెఫాలీ వర్మ, ఆ తర్వాత ఒకే ఓవర్‌లో మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్‌ను పెవిలియన్ చేర్చింది.

ఓవరాల్‌గా టోర్నీలో ఇప్పటివరకు సైకా అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిరూపించుకుంది.

సైకా 3 మ్యాచ్‌ల్లో 10.1 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో సైకా ఇషాక్ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకుంది.

సైకా ఇషాక్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పుట్టి పెరిగింది.

బెంగాల్ తరపున అండర్-23 స్థాయిలో కూడా ఆడింది.

సైకాను ముంబై వేలంలో రూ.10 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది.