కుక్కల మాంసం తినే దేశాలివే..

చైనాలో దాదాపు 130 మిలియన్ల పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయినప్పటికీ చైనాలో వేల యేళ్లనాటి నుంచి కుక్క మాంసం తినడం, విక్రయించడం వాళ్ల జీవన విధానంలో సాధారణమైపోయింది

దక్షిణ కొరియాలో 20 వేలకు పైగా రెస్టారెంట్లు కుక్క మాంసం రుచులను అందిస్తున్నాయి. రోజుకు 15వేల కుక్కలు, పిల్లులను తింటారు. 

ఫిలిప్పీన్స్‌లో ఏడాదికి అర మిలియన్ కుక్కలు మాంసం కోసం వధించబడతాయి. వారి రాత్రి భోజనంలో కుక్క మాంసం లేకుండా ఉండదు

వేయించిన పిల్లి మాంసంతో తయారు చేసే బీర్ హనోయి వియత్నాంలో ప్రసిద్ధ వంటకం. కుక్కల రాతి విగ్రహాలను పూజించే ఈ దేశంలో కుక్క మాంసం తినడం ఓ ఆచారం

కుక్క మాంసం, కుక్క చర్మంతో థాయ్‌లాండ్‌లో కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. థాయ్‌లాండ్‌లోని టారే పట్టణం అక్రమ కుక్కల దొంగతనం, స్మగ్లింగ్ మరియు అక్రమ రవాణాకు కేంద్రంగా ఉంది

ప్రపంచ ఆకలి సూచిలోని 56 దేశాలో ఇది 25వ స్థానంలో ఉంది. దాదాపు ప్రతి రాత్రి దొంగిలించిన వీధి కుక్కలను లావోస్‌కు మెకాంగ్ నది మీదుగా అక్రమంగా రవాణా చేస్తుంటారు

తైవాన్‌లో కుక్క మాంసాన్ని 'fragrant meat (సువాసన మాంసం)' అంటారు. ముఖ్యంగా శీతాకాలంలో నల్ల కుక్కలను అధికంగా తింటారు.

ఇండోనేషియాలోని ప్రధానంగా ముస్లిం జనాభా ఉంటుంది. అయితే ఇండోనేషియాలోని మినాహాసా అనే క్రైస్తవ గిరిజనులు మాత్రం కుక్కలు, పిల్లులు, అటవీ ఎలుకలు, గబ్బిలాలు తింటుంటారు.